అల వైకుంఠపురములో టీజర్ వాయిదా.. హ్యాట్సాఫ్ అంటోన్న నెటిజన్లు
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న అల వైకుంఠపురములో సినిమాపై ఎంతటి అంచనాలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ.. హైప్ క్రియేట్ చేసుకుంటూ వచ్చిన చిత్రయూనిట్ టీజర్‌తో మరోసారి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమైంది. అయితే అకస్మాత్తుగా ఈ టీజర్ రిలీజ్‌ను వాయిదా వేసేశారు. దీంతో నెటిజన్లంతా హ్యాట్సాఫ్ అంటూ పొగిడేస్తున్నారు. ఇంతకీ దాని వెనుకున్న కథేంటో ఓసారి చూద్దాం.

మెగా అభిమాని ఆకస్మిక మృతి..
గ్రేటర్ హైద్రాబాద్ చిరంజీవి యువత లీడర్, మెగా ఫ్యాన్ అయిన నూర్ మహ్మద్ ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో మెగా అభిమానులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. తోటి ఫ్యాన్స్ కాక.. మెగా హీరోలు సైతం నూర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నారు.

సోషల్ మీడియా వేదికగా మెగా హీరోల స్పందన..
నూర్‌కు మెగా హీరోలందరితోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పలు సందర్భాల్లో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా అందరితోనూ కలిసిన సంగతి తెలిసిందే. నూర్ మరణంతో కుంగిపోయిన మెగాహీరోలు సోషల్ మీడియాలో వేదికగా స్పందిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

కుటుంబాన్ని పరామర్శించిన చిరు, బన్నీ
నూర్ మరణంతో బాధపడుతున్న ఆయన కుటుంబాన్ని చిరంజీవి, అల్లు అర్జున్ పరామర్శించారు. ఆర్థికంగా అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి.
వాయిదా వేస్తోన్న ప్రకటించిన గీతా ఆర్ట్స్..
‘నూర్ లాంటి అభిమాని మరణంతో.. కుటుంబంలోని ఓ వ్యక్తిని కోల్పోయినట్లు అనిపిస్తోంది. నూర్ భాయ్ లాంటి వారు మా కుటుంబంలోని ఓ వ్యక్తి. ఇలాంటి సమయంలో ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వదలుచుకోలేదు' త్వరలోనే టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్ రేపు ఉదయం పది గంటలకు ప్రకటిస్తామని గీతా ఆర్ట్స్ ప్రకటించింది.
Recommended Video

హ్యాట్సాఫ్ అంటోన్న నెటిజన్లు..
అభిమాని మరణంతో ఇలాంటి ప్రకటన చేయడంపై అభిమానులే కాక.. నెటిజన్లు సైతం హ్యాట్సాఫ్ అని అంటున్నారు. అయితే ఇప్పటికే టీజర్ నుంచి కొన్ని షాట్స్ లీకవ్వడంతో మరింత హైప్ పెరిగింది.


Click it and Unblock the Notifications











