లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్.. ఫస్ట్ లుక్ వైరల్

మహానటి సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. జెమినీ గణేషన్ పాత్రలో కీర్తి సురేష్‌కు సరిసమానంగా నటించాడు. మాలీవుడ్‌లో సూపర్ స్టార్ అయినా మహానటిలో ఆ కీ రోల్ పోషించడం, అది కూడా వర్కౌట్ అవ్వడంతో టాలీవుడ్‌ జనాలకు బాగా నచ్చేశాడు. మహానటి సినిమా తరువాత దుల్కర్ సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. అయితే నేరుగా తెలుగులో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు దుల్కర్ సిద్దమయ్యాడు.

చివరగా వచ్చిన కనులు కనులు దోచాయంటే అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. లవ్ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్నే నమోదు చేసింది. నేడు దుల్కర్ బర్త్ డే సందర్భంగా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. వైజయంతీ మూవీస్ సమర్పణలొ స్వప్నాదత్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.

Dulquer salmaan As Lieutenant Ram

యుద్దంతో రాసిన ప్రేమ కథ అనే ట్యాగ్‌లైన్‌తో చిత్రంపై అంచనాలుపెంచేశారు. దక్షిణాది భాషల్లో విడుదల చేయబోతోన్న ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ మేరుక ఆయన ట్వీట్ చేస్తూ... 'దుల్కర్ సల్మాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. చరిత్ర పుటల్లోంచి ఓ గొప్ప ప్రేమను చెప్పేందుకు దుల్కర్ అలియాస్ లెఫ్టినెంట్ రామ్‌గా వైజయంతి, స్వప్నా సినిమా సంస్థల ఆధ్వర్యంలో రాబోతోన్నామ'ని తెలిపాడు. ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X