Don't Miss!
- News ముస్లింలోను ఓబీసీ జాబితాలో చేర్చిన ప్రభుత్వం
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
రకుల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.. మలయాళీ అందగాడిని మరచిన వైనం!
Recommended Video
మొన్నటి వరకు టాలీవడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గాయి. కానీ యువతలో మాత్రం రకుల్ కు మంచి క్రేజ్ ఉంది. టాలీవడో లో చాలామంది స్టార్ హీరోగా సరసన రకుల్ నటించింది. తాజగా రకుల్ ప్రీత్ సింగ్ టార్గెట్ గా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మహానటి చిత్రం విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన చిన్న పొరపాటే దీనికి కారణం. మహానటి చిత్రం విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
జోరు బాగా తగ్గింది
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవడ్ లో క్రేజీ హీరోయిన్ గా బడా హీరోల సరసన నటించింది. మొన్నటివరకు జోరుమీదున్న రకుల్ సినీ కెరీర్ ఇప్పుడు బాగా తగ్గింది. రకుల్ కు అవకాశాలు కరువయ్యాయి.
సెలెబ్రిటీల ప్రశంసలు
ఇటీవల విడుదలైన మహానటి చిత్రంపై సెలెబ్రిటీలంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో మహానటి చిత్రం గురించి తమ అభిప్రాయాలు తెలియజేస్తూ కీర్తి సురేష్ సహా ఇతర నటీనటులని ప్రశంసిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా మహానటి చిత్రం చూసి తన అభిప్రాయాన్ని తెలిపింది.
రకుల్ చేసిన పొరపాటు
మహానటి చిత్రం మాస్టర్ పీస్ అంటూ ప్రశంసించింది. కీర్తి సురేష్ నటనతో అదరగొట్టిందని తెలిపింది. సమంత, విజయ్ దేవరకొండ కూడా చాలా బాగా నటించారని రకుల్ ప్రశంసించింది. కానీ ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషించిన మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ని మాత్రం మరచిపోయింది.
రకుల్‌పై విమర్శలు
అందరి గురించి ప్రస్తావించిన రకుల్.. దుల్కర్ సల్మాన్ ని మరచిపోవడంతో విమర్శలు చెలరేగుతున్నాయి. దుల్కర్ ఫాన్స్ రకుల్ టార్గెట్ గా కామెంట్స్ పెడుతున్నారు. దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో జెమినీగణేశన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.