కింగ్ ఆఫ్ కోత టీజర్.. వైలన్స్తో దుల్కర్ గూస్ బంప్స్ తెప్పించేశాడు!
హీరో దుల్కర్ సల్మాన్... ఓకే బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన.. పలు సినిమాలు చేసినప్పటికీ.. గత ఏడాది వచ్చిన సీతారామం సినిమాతో మరింత దగ్గరయ్యాడు. రామ్ గా తెలుగు హృదయాల్లో గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. ఇదిలా ఉంటే ఆయన నెక్ట్స్ మూవీ కింగ్ ఆఫ్ కోత టీజర్ వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
ట్రెండింగ్ లో వీడియో...:ఈ మలయాళ హీరోకు... తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమా ఇండస్ట్రీల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ హీరో అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ... అక్కడి వారిని ఆకట్టుకుంటున్నాడు. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం చేస్తున్న సినిమా 'కింగ్ ఆఫ్ కోతా'. ఈ సినిమాకు డైరెక్టర్ అభిలాష్ జోషి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎప్పుడో గత ఏడాది ప్రారంభం అయి.. షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ.. ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఆ వీడియోతో సినిమాపై మరింత అంచనాలు నెలకొన్నాయి.

కింగ్ ఆఫ్ కోత టీజర్ రిలీజ్:కింగ్ ఆఫ్ కోత... గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. రాజు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు అనే సంభాషణలతో టీజర్ ప్రారంభం అయింది. తమ భూమిని కాపాడే రాజు అతనొక్కడేనని ఆ ప్రజలు నమ్ముతున్నారు.. అంటూ దుల్కర్ సల్మాన్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్తున్న డైలాగ్స్ తో సాగుతున్న టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

ఈ సారి పాన్ ఇండియా హీరోగా...:ఇక దుల్కర్ సల్మాన్ కి ఏ భాషకి ఆ భాషలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ మలయాళం ఇండస్ట్రీకి ఒక్క పాన్ ఇండియా హీరో లేడు అనే లోటు ఉండగా.... ఆ లోటుని దుల్కర్ సల్మాన్ ఈ సినిమాతో తీర్చానున్నాడని అంటున్నారు. అమ్మాయిల మనస్సులను దోచిన ఈ హీరో ఈ పాన్ ఇండియా సినిమాతో యాక్షన్ హీరోగా ఎదుగుతాడని అంటున్నారు.

ఓనమ్ కానుకగా...:ఇక ఈ చిత్రాన్ని వేఫరెర్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీకి షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. కింగ్ ఆఫ్ కోతలో ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఓనమ్ 2023 కానుకగా పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











