మహానటి ఆడియో లాంచ్: తెలుగులో స్పీచ్ ప్రారంభించిన దుల్కర్.. వారికి పెద్ద అభిమానిని!
భారతీయ చలన చిత్ర రంగంలో దిగ్గజ నటి సావిత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందరో నటులకు ఆదర్శం ఆమె. నటిగా తిరుగులేని ఖ్యాతిని గడించిన సావిత్రి జీవితానికి సంబందించిన ఎన్నో మధురమైన విషయాలు, చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె జీవితం గురించి పూర్తిగా అభిమానులకు తెలియదు. సావిత్రి బయోపిక్ గా రూపొందుతున్న మహానటి చిత్రం ద్వారా సావిత్రి జీవితానికి సంబంధించిన అనేక విషయాలని దర్శకుడు నాగ అశ్విన్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో వేడుక నేడు జరగబోతోంది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవుతుండడం విశేషం. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ దేవర కొండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే ఆడియో వేడుక ప్రారంభమైంది.

అందరికి నమస్కారం అంటూ మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నానని దుల్కర్ తెలిపారు. తాను సావిత్రి, జెమినీ గణేషన్ కు పెద్ద అభిమానిని అని దుల్కర్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











