twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాణా రెండో చిత్రం రిలీజ్ కు గోవా గవర్నమెంట్ సమస్య

    By Srikanya
    |

    లీడర్ తో పరిచయమైన రాణా తన ద్వితీయ చిత్రంగా చేసిన బాలీవుడ్ చిత్రం దమ్ మారో దమ్ ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. గోవా గవర్నమెంట్ ఈ చిత్రంలో తమ ప్రాంతాన్ని విమర్శించే డైలాగులు గానీ సన్నివేశాలు కానీ ఉంటే చాలా సీరియస్ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న రీతిలో వార్నింగ్ ఇచ్చింది. ఈ చిత్రం గోవా బ్యాక్ డ్రాప్ లో మాదక ద్రవ్యాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నేపధ్యంలో సాగుతుంది. గోవాకి టూరిజమే ఆదాయం కాబట్టి సినిమాల ద్వారా తమ పరువు పోగొట్టి తమ ఆదాయ వనరులపై దెబ్బ తీస్తే ఊరుకునేది లేదని చెప్తోంది. మరో ప్రక్క దేవానంద్ తన హరే రామ హరే కృష్ణ చిత్రంలోని దమ్ మారో దమ్ పాటనుంచి టైటిల్ ని తీసుకుని ఇలాంటి సినిమాతీసారంటూ మండిపడుతున్నాడు. దాంతో చిత్ర యూనిట్ వారు తలపట్టుకు కూర్చున్నారు.

    ఇవన్ని ఇలా ఉంటే రాణా తెలుగులో రెండో చిత్రం నేనూ నా రాక్షసి షూటింగ్ పూర్తయినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయింది. ఈ విషయాన్ని ప్రక్కన పెట్టి రాణా తన మూడో చిత్రానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక దమ్ మారో దమ్ చిత్రం ఏప్రిల్ 22న విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు.

    రోహన్ సిప్పీ దర్శకత్వం లో రూపొందిన ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, రాణా, బిపాషా బసు, ప్రతీక్ బబ్బర్ (రాజ్‌బబ్బర్ కుమారుడు) కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ చిత్రలో రాణా, బిపాషా జంటగా చేసింది.అలాగే దేవానంద్ సూపర్ హిట్ 'హరే రామ హరే కృష్ణ'లోని పాపులర్ సాంగ్ 'దమ్ మారో దమ్'ని ఈ సినిమాలో రీమిక్స్ చేశారు. ఆ పాటకి దీపికా పదుకోనే డాన్స్ చేసింది. డ్రగ్స్, సెక్స్, రాక్ అండ్ రోల్ పార్టీల నేపధ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. గోవా నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా నటించాడు. అక్కడ స్ధానిక గోవా కుర్రాడుగా రాణా కీలక పాత్రని చేశాడు. రమేశ్ సిప్పీ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

    English summary
    Goa tourism industry has voiced concern that filmmaker Rohan Sippy's upcoming flick 'Dum Maro Dum' may show the state in poor light, thereby affecting the industry, which is recovering from a lean period.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X