విజయ్ విడాకులు : భార్య టార్చరా? ఆమెతో ఎఫైరా?

By Bojja Kumar

బెంగుళూరు : సంసారంలో ఆటు పోట్లు సామాన్య జనాల జీవితాల్లోనే కాదు...సినిమా వాళ్లకు కూడా ఉంటాయి. తాజాగా సంసార జీవితంలో సమస్యలతో సతమతం అవుతున్నాడు కన్నడ నటుడు దునియా విజయ్. భార్యతో విడాకులు ఇప్పించాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.

దునియా విజయ్ 14 సంవత్సరాల క్రితం నాగరత్న ను పెళ్లాడాడు. వారికి ముగ్గురు సంతానం. కన్నడ మీడియా కథనాల ప్రకారం.....విజయ్ తన విడాకుల పిటీషన్లో భార్య నాగరత్న తనను మెంటల్‌గా టార్చర్ పెడుతోందని, తన తల్లిదండ్రులను సరిగా చూసుకోవడం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అయితే గత కొంతకాలంగా కన్నడ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం....ఓ ప్రముఖ కన్నడ నటితో దునియా విజయ్ ఎఫైర్ పెట్టుకున్నాడని, ఈ కారణం వల్లనే అతని కాపురంలో కలతలు వచ్చాయనే మరో కోణం కూడా వినిపిస్తోంది. అయితే దునియా విజయ్ మాత్రం ఈ వార్తలను ఖండించారు. త్వరలో కోర్టు దునియా విజయ్ విడాకులపై తీర్పు వెలువరించనుంది. తన విడాకుల విషయమై మాట్లాడేందుకు దునియా విజయ్ ఇష్ట పడటం లేదు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X