For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇద్దరి ప్రాణాలు బలి: హీరో, దర్శకుడు, నిర్మాత, స్టంట్ మాస్టర్‌పై నిషేధం!

  By Bojja Kumar
  |

  బెంగులూరు: కన్నడమూవీ మాస్తిగుడి మూవీ క్లైమాక్స్ చిత్రీకరణలో సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఇద్దరు నటులు అనిల్, ఉదయ్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే దర్శక నిర్మాతలు, స్టంట్ మాస్టర్ మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

  ఈ సంఘటనపై కన్నడ చిత్రసీమ కూడా సీరియస్ గా స్పందించింది. కర్నాటక చలనచిత్ర వాణిజ్యమండలి మాస్తిగుడి నిర్మాత సుందర్‌, హీరో దునియా విజయ్‌, దర్శకుడు నాగశేఖర్‌, స్టంట్‌ డైరెక్టర్‌ రవివర్మలపై నిషేధం విధించింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంతవరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది.

  చర్యలు

  చర్యలు

  ఈ ఘటనకు నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా కన్నడ చలనచిత్ర వాణిజ్యమండలి కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించింది. అనుమతి లేకుండా ఈ నలుగురూ సినీ నిర్మాణ కార్యకలాపాలలో పాల్గొనరాదని మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు ఆదేశాలు జారీ చేశారు.

  వాస్తవాలు తేల్చేందుకు కమిటీ

  వాస్తవాలు తేల్చేందుకు కమిటీ

  మాస్తిగుడి విషాద ఘటనలో నిజానిజాల తేల్చేందుకు వాణిజ్యమండలి తరపున నటులు, కళాకారులు, నిర్మాత, దర్శకులతో కూడిన నిజ నిర్ధారణ బృందాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందం సమర్పించే నివేదిక ఆధారంగా ఈ ముగ్గురిపై నిషేధాన్ని ఇంకెంతకాలం కొనసాగించాలో తీర్మానించనున్నారు.

  రోజుల తర్వాత శవం కుళ్లిపోయి

  రోజుల తర్వాత శవం కుళ్లిపోయి

  నటుడు ఉదయ్‌ మృతదేహం మంగళవారం రాత్రి వెలికి తీశారు. మరో నటుడు అనిల్‌ మృతదేహం నాలుగు రోజుల తర్వాత గురువారం ఉదయం లభ్యమైంది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో జలాశయం వద్దే పోస్టుమార్టం నిర్వహించారు.

  నటుడు అనిల్

  నటుడు అనిల్

  జాతీయ విపత్తు సహాయక దళం బృందాలు, గజ ఈతగాళ్లు ఇలా మొత్తం 50 మందికిపైగా గాలింపులో పాల్గొన్ని అనిల్ మృత దేహాన్ని వెలికి తీసారు.

  హీరో దునియా విజయ్

  హీరో దునియా విజయ్

  నటుడు దునియా విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న మాస్తిగుడి సినిమా షూటింగ్‌లో భాగంగా బెంగళూరు సమీపంలోని తిప్పగొండనహళ్లి లేక్‌లో హెలికాప్టర్‌ పైనుంచి దూకే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా మొదట ఇద్దరు వర్ధమాన నటులు ఉదయ్‌, అనిల్‌ హెలికాప్టర్‌ నుంచి దూకారు. అనంతరం చిత్ర కథానాయకుడు విజయ్‌ నీటిలోకి దూకాడు. అయితే వీరిలో ఉదయ్‌, అనిల్‌ మృతి చెందారు. వెంటనే స్పందించిన చిత్ర బృందం కథానాయకుడు విజయ్‌ను రక్షించింది.

  నిర్లక్ష్యమే కారణం

  నిర్లక్ష్యమే కారణం

  అనీల్, ఉదయ్ చావుకు మాస్తిగుడి సినిమా యూనిట్ సభ్యుల నిర్లక్షమే కారణం అని తాము ఎంత చెప్పినా వారు పట్టించుకోలేదని జలమండలి అధికారులు ఆరోపించారు. తాము ముందుగా సూచించిన సలహాలు గాలికి వదిలివేసి ఇష్టం వచ్చినట్లు షూటింగ్ చెయ్యడం వలనే ఇద్దరు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని అధికారులు అంటున్నారు.

  కేసు నమోదు

  కేసు నమోదు

  దునియా విజయ్ హీరోగా నటిస్తున్న మాస్తిగుడి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ సమయంలో జలసమాధి అయిన ప్రతినాయకులు అనీల్, రాఘవ్ ఉదయ్ చావుకు మీరే కారణం అంటూ సినిమా యూనిట్ సభ్యుల మీద రామనగర జిల్లా తావరకెరె పోలీసులు కేసు నమోదు చేశారు.

  ఈత పెద్దగా రాదు

  ఈత పెద్దగా రాదు

  సినిమా క్లైమాక్స్ దృశ్యాలను మరింత సహజంగా తీయాలని స్టంట్ డైరెక్టర్ రవి వర్మ ప్రయత్నించడం ఇద్దరు కన్నడ నటుల ప్రాణాలను హరించింది. తమకు ఈత రాదని ఎంత మొత్తుకున్నా వినని రవి వర్మ, వీరిని చాపర్ నుంచి కిందకు దూకాల్సిందేనని చెప్పడం, ఆపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే 'యాక్షన్' చెప్పడం వీరి మరణానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటన వెనుక చిత్ర యూనిట్ నిలువెత్తు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. లైఫ్ జాకెట్లు అందుబాటులో లేకపోవడం, మరపడవలు దూరంగా ఉండటం తదితరాలు వారి మరణానికి కారణమయ్యాయి.

  నాన్ బెయిలబుల్

  నాన్ బెయిలబుల్

  పోలీసులు ఎఫ్ఐఆర్ తయారు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మాస్తిగుడి సినిమాలో ప్రతినాయకులు అయిన అనీల్, ఉదయ్ చావుకు కారణం అయ్యారంటూ ఐపీసీ సెక్షన్ 304 (ఆ), 308 కింద నిర్మత, దర్శకుడు మీద నాన్ బెయిల్ కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

  ఫైట్ మాస్టర్

  ఫైట్ మాస్టర్

  తమకు ఈత రాదు మొర్రో అని మొత్తుకుంటున్నా స్టంట్‌ డైరెక్టర్‌ రవి వర్మ వీరిద్దరితో సహజత్వం కోసం ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టకుండానే సన్నివేశాలను చిత్రీకరించడంపై కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

  కుటుంబానికి దిక్కెవరు?

  కుటుంబానికి దిక్కెవరు?

  మరో విలన్ అనిల్‌కు వివాహమై ఇద్దరు బిడ్డలున్నారు. వీరిద్దరి అకాల మృతితో ఆధారం కోల్పోయిన కుటుంబాలు ఆధారం కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నాయి.విలన్ ఉదయ్‌ ఎక్కడికి వెళ్ళినా ప్రతి రోజూ తన తల్లి కౌశల్యకు చెప్పి ఆమె ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళ్లేవాడు. ఉదయ్‌ మూడు రోజుల క్రితమే పెళ్ళి చూపులకు వెళ్లివచ్చాడు. తన అక్క, చెల్లె వివాహాలు జరిపి తాను కూడా జీవితంలో స్థిరపడాలనుకుంటున్నంతలోనే అతన్ని మృత్యువు కాటేసింది

  కెరీర్ ఉదయ్‌,

  కెరీర్ ఉదయ్‌,

  అనిల్‌లు ఒకేసారి కన్నడ సినీ పరిశ్రమలోకి ఒకసారే ప్రవేశించారు. ఒకసారే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్‌ ప్రారంభించి దేహదారుడ్యాన్ని పెంచుకొని విలన్లుగా ఎదిగారు. వీరు విలన్లుగా నటించిన పలు చిత్రాలు బాక్సాఫీసు రికార్డులు సృష్టించాయి.

  రిహార్సల్ చేయలేదు

  రిహార్సల్ చేయలేదు

  ఖర్చులు తగ్గించుకోవడానికి కన్నడ సినీ పరిశ్రమలో నిర్మాతలు రిహార్సల్స్‌ను, ముందస్తు ప్రాక్జీస్‌ను వదిలేస్తున్నారని పరిశ్రమ వర్గాలంటున్నాయి. కన్నడ సినీ పరిశ్రమలో ఇతర భాషా పరిశ్రమల్లో మాదిరిగా ఎక్కువ ఖర్చు చేయబోరని, తక్కువ బడ్జెట్‌తో ఖర్చును తగ్గిస్తూ సినిమాలు తీస్తారని అంటున్నారు.

  English summary
  Karnataka Film Chamber of Commerce headed by Sa Ra Govindu had called up for a meeting with various associations regarding Maasti Gudi mishap, yesterday. Members of producers, directors, stunt directors associations were a part of the meet. Sa Ra Govindu, after the closed door meeting, briefed the media regarding the decisions taken by his team. Major outcome of the meet was to expel Duniya Vijay, director Nagshekar and Action Director Ravi Verma from all sort of film activities until further notice.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X