తప్పుడు కేసులు పెట్టారంటూ హీరో విజయ్ ధర్నా
బన్నేరుఘట్ట రోడ్డులోని రశ్మి (ఆనంద్ ప్రేమించిన యువతి) ఇంటి ముందు బుధవారం ఆయన కొంత సమయం ధర్నా చేశారు. ఆనంద్ కనిపించే వరకు తన ఆందోళన కొనసాగించాలని నిర్ణయించానని చెప్పారు. త్వరలో ఆనంద్ తిరిగి వస్తాడని ధీమా వెలిబుచ్చారు.
వివరాల్లోకి వెళితే రెండు రోజుల క్రితం .. నటుడు విజయ్‌పై జిగణి పోలీసు స్టేషన్‌లో అపహరణ కేసు నమోదైంది. తన కుమారుడు ఆనంద్‌ను తన అల్లుడే అపహరించాడంటూ నాగరత్న తండ్రి జయణ్ణ ఫిర్యాదు చేశారు. ఆనంద్‌కు, రశ్మి అనే యువతిని ఇచ్చి వివాహం చేసేందుకు విజయ్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని దీన్ని తాము అడ్డుకున్నందుకే తన కుమార్తె నాగరత్నకు విడాకుల్ని ఇచ్చేందుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఆనంద్‌ను అపహరించుకు వెళ్లిన విజయ్ తనకు, అపహరణకు ఎటువంటి సంబంధం లేదని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు.
చిన్న కారణాన్ని చూపి విజయ్ తన భార్య నాగరత్నకు విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారని నాగరత్న కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరో యువతిని వివాహం చేసేందుకు, తమ కుమారుడిని తమ నుంచి దూరం చేసేందుకే ఆయన ఇలా చేస్తున్నారని ఆక్రోశించారు. దునియా విజయ్ 14 సంవత్సరాల క్రితం నాగరత్న ను పెళ్లాడాడు. వారికి ముగ్గురు సంతానం. కన్నడ మీడియా కథనాల ప్రకారం.....విజయ్ తన విడాకుల పిటీషన్లో భార్య నాగరత్న తనను మెంటల్‌గా టార్చర్ పెడుతోందని, తన తల్లిదండ్రులను సరిగా చూసుకోవడం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












