స్టార్ హీరోలపై ఆగని వ్యంగ్యాస్త్రాలు, సెటైర్లు...
సునీల్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు" రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమపై ఈ చిత్రం సెటైర్లు వేయనుంది. హీరోలపై కూడా రామూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాడట. స్టార్ హీరోలపై సెటైర్ల కోసం రామూ ఆ హీరోలు పోలికలున్న డూప్ లను వాడుకున్నాడు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ ల పోలికలతో డూప్ లు ఉన్నారు. ఈ డూప్ హీరోలు హీరోలుగా ఏకంగా ఆ మధ్య ఓ సినిమా కూడా చేశారు. అయితే ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు రామూ దర్శకత్వంలో చేయడం వారికి జాక్ పాట్ లాంటి అవకాశం అని చెప్పొచ్చు. ఈ డూప్ హీరోలందరూ ఓ ప్రముఖ టివి ఛానెల్ లో రియాల్టీ షోలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
కాగా ఈ చిత్ర ఆడియో వేడుక సోమవారం రాత్రి తాజ్ బంజారా హొటల్ లో జరిగింది. సినిమాలో ఆరు పాటలు ఉండగా ఇందులో ఒక పాటతో సిడిని రూపొందించి దాన్ని విడుదల చేశారు. ఆడియో విడుదలలో విభిన్నమైన పద్దతిని అనుసరిస్తూ ఇలా చేయడం చిత్రపరిశ్రమలో ఇదే ప్రధమం. ప్రతి సోమవారం ఒక్కో పాట చొప్పున ఇలా ఆడియోను విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు. హీరోలకు కొత్త స్టైల్ ని హీరోయిన్స్ కి కొత్త లుక్ ని దర్శకుడిగా తను ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నది అప్పల్రాజు వివరించడం ఈ పాట ప్రత్యేకత.


Click it and Unblock the Notifications











