సూర్య ‘డూప్లికేట్’ రిలీజ్ డేట్
చెన్నయ్: సూర్య తాజాగా రంగం దర్శకుడు కె.వి ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్న తమిళ చిత్రం 'మాట్రాన్'. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో 'డూప్లికేట్'గా విడుదల చేస్తున్నారు. ఇందులో సూర్య అవిభక్త కవలలుగా కనిపించబోతున్నారు. అక్టోబర్ 12న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈచిత్రం తెలుగు రైట్స్ దక్కించుకున్నారు.
థాయ్‌లాండ్‌కు చెందిన చాంగ్, ఈంగ్ అనే అవిభక్త కవలల జీవితం ఆధారంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డబల్ రోల్ కావడంతో ఇందులో సూర్య ఒక్కో సన్నివేశం కోసం మూడు, నాలుగుసార్లు నటించాల్సి వచ్చింది. కాజల్ ఈ చిత్రం కోసం సాధ్యమైనంత ఎక్కువగా తన అందాలు ఆరబోసింది.
కెవి ఆనంద్ దర్శకత్వంలో జీవా హీరోగా రూపొందిన చిత్రం తెలుగులో 'రంగం'టైటిల్ తో విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. అదే స్పూర్తితో సూర్యకి, కెవి ఆనంద్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నారు. అదే విధంగా హీరోయిన్ కాజల్ కావడం కూడా కలిసొచ్చే అంశం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజీలలో ఉంది.


Click it and Unblock the Notifications











