హీరోయిన్‌తో డూప్లికేట్ షారుఖ్
ప్రముఖ దర్శకుడు మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో 'హీరోయిన్' అనే బాలీవుడ్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కరీనా కపూర్ టైటిల్ రోల్ చేస్తున్న ఈచిత్రం లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో సాగుతుంది. తాజాగా బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం దర్శకుడు ఈ చిత్రంలో డూప్లికేట్ షారుఖ్‌ను ప్రవేశ పెట్టాడని, హీరోయిన్ పాత్ర పోషిస్తున్న కరీనాకు జోడీగా ఆ డూప్లికేట్ కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తాడని తెలుసుస్తోంది. టెలివిజన్ షోల్లో హీరోల డూప్‌గా నటించే రాకేష్ వశిస్థ్ డూప్లికేట్ షారుఖ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ కూడా మేల్ సూపర్ స్టార్ పాత్రలో బెబోకు జోడీగా నటిస్తున్నాడు.
కరీనా కపూర్, అర్జున్ రాంపాల్, రణదీప్ హుడా, షహనా గోస్వామి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈచిత్రాన్ి మధుర్ బండార్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సలీమ్ సులేమాన్ సంగీతం అందిస్తున్నారు. మధుర్ బండార్కర్, నిరంజన్ లేంగర్ స్క్రీన్ ప్లే విభాగానికి పని చేస్తున్నారు. రూ. 18 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి నిర్మాతగా రోనీస్రేవాలాతో పాటు, మధుర్ బండార్కర్, కరీనా కపూర్ కూడా ఉన్నారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, బండార్కర ఎంటర టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని మార్కెటింగ్ః చేస్తు. సెప్టెంటర్ 14, 2012న ఈ చిత్రం విడుదలకానుంది.
ప్రముఖ దర్శకుడు మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో 'హీరోయిన్' అనే బాలీవుడ్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కరీనా కపూర్ టైటిల్ రోల్ చేస్తున్న ఈచిత్రం లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో సాగుతుంది. తాజాగా బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం దర్శకుడు ఈ చిత్రంలో డూప్లికేట్ షారుఖ్‌ను ప్రవేశ పెట్టాడని, హీరోయిన్ పాత్ర పోషిస్తున్న కరీనాకు జోడీగా ఆ డూప్లికేట్ కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తాడని తెలుసుస్తోంది.


Click it and Unblock the Notifications











