twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతనికి 60..ఆమెకు 13

    By Staff
    |

    Durga
    'గూడెంలో ఉన్న ఒక మూఢాచారం వల్ల అరవై ఏళ్ల వృద్ధుడితో జీవితాంతం గడపాల్సిన పరిస్థితి ఏర్పడటంతో అది సహించలేని ఒక పదమూడేళ్ల బాలిక ఏ విధంగా ఆ మూఢాచారాన్ని ప్రతిఘటించి తనని తాను రక్షించుకోవడమే కాకుండా గూడెంలో ఉన్న తనలాంటి వారినెందరినో ఎలా రక్షించిందన్న ఇతివృత్తంతో దుర్గి అనే సినిమా రూపుదిద్దుకుంది. గిరిజన గూడెంలో జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.

    శ్రీ చక్ర మూవీ మేకర్స్‌ పతాకంపై సి.వి.రెడ్డి సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మించారు. 'దుర్గి' సినిమాతో ఆనంద్‌ సంకారపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే ఒకటిన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు సి.హెచ్‌.వి.ఎస్‌.ఎన్‌. బాబ్జీ, తాళ్ల బాలచంద్రారెడ్డి చెప్పారు. సినిమా బాగుందని ప్రభుత్వం అభినందించడమే కాకుండా వినోదపు పన్నులో రాయితీ కూడా కల్పించిందని చిత్ర సమర్పకుడు సి.వి.రెడ్డి తెలిపారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌ అంతటా కొమ్మినేని రమేష్‌ చౌదరి విడుదల చేస్తున్నారని చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X