అలా 'దూకుడు' కి గవర్నమెంట్ సహకారం
మహేష్ తాజా చిత్రం దూకుడు ఈ 23 న విడుదలకి సెన్సార్ U/A సర్టిఫికేట్ తో క్లియరెన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు రోజునుంచే అంటే సెప్టెంబర్ 22 నుంచే దశరా శెలవులు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించినట్లు సమాచారం. దాంతో ఈ చిత్రం వసూళ్ళకు ఈ శెలవులు బాగా ప్లస్ అవుతాయనటంలో సందేహం లేదు. ఇక దూకుడు హైదరాబాద్ లో డబ్బై స్క్రీన్స్ లో విడుదల అవుతోంది. అలాగే చెన్నై సిటీలోనూ 17 స్క్రీన్స్ లో విడుదల అవుతోంది. ఇప్పటివరకూ ఇన్ని స్క్రీన్స్ లతో ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. అలాగే నీ దూకుడు...సాటెవ్వడు అంటూ అదిరిపోయే లెవెల్లో ఆడియో ఫంక్షన్ చేసిన నిర్మాతలు అంతకన్నా ఘనంగా 23న భారీ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమైపోతున్నారు.తన తాజా చిత్రం దూకుడు గురించి మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే.. మా డైరక్టర్ మాటల ప్రకారం దూకుడు ఫస్టాఫ్ ఆర్.ఆర్ అవుట్ స్టాండింగ్. తమన్ కే ఈ ప్రశంసలు అన్నీ దక్కుతాయి. ధాంక్యూ తమన్.సెకెండాఫ్ కూడా ఇంతకన్నా బాగా చేస్తాడని ఆసిస్తున్నాను.నా వరకూ చెప్పాలంటే నేను గ్రేట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నాను. పని..పని..పని అన్నట్లుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











