పనిగట్టుకొని దుష్ప్రచారం.. కైరా అలా చేస్తుందా? ‘భరత్’ వివాదంపై దానయ్య, కొరటాల
టాలీవుడ్‌లో భారీ చిత్రాల నిర్మాణాలతో దూసుకెళ్తున్న నిర్మాతల్లో డీవీవీ దానయ్య ఒకరు. ఆయన రూపొందించిన భరత్ అనే నేను సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసుకొన్నది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. దర్శకుడు కొరటాల శివకు మంచి విజయాన్ని అందించింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి రెమ్యూనరేషన్ల విషయం వివాదాస్పదమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
Recommended Video


ఆ వార్తలో నిజం లేదు
దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ కైరా అద్వానీకి ఇంకా పూర్తిగా రెమ్యునరేషన్ ఇవ్వలేదు అని ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రెమ్యునరేష్‌కు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొరటాల శివ, నిర్మాత దానయ్య ఖండించారు.

నా ట్రాక్ రికార్డు ఫర్‌ఫెక్ట్
భరత్ అనే నేను సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి రెమ్యునరేషన్ చెల్లించాం. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. రెమ్యునరేషన్ల చెల్లింపు విషయంలో నా ట్రాక్ రికార్డు ఫర్‌ఫెక్ట్. తనపై వచ్చిన వార్తలో ఎలాంటి నిజం లేదు. రెమ్యునరేషన్ ఇవ్వలేదని వచ్చిన వార్తను ఖండిస్తున్నాను అని దానయ్య ఓ ప్రకటనలో వెల్లడించారు.

కొందరు పనిగట్టుకొని ప్రచారం
మంచి చిత్రాన్ని తీశావని భరత్ అనే నేను చిత్రంపై ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు పనిగట్టుకొని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. రెమ్యునరేషన్ చెల్లించలేదని ఏ టెక్నిషియన్, ఆర్టిస్టు ఇప్పటి వరకు రాలేదు అని దానయ్య ఆవేదన చెందారు.

ఆ వార్త చూసి షాక్ తిన్నాను
హీరోయిన్ కైరా అద్వానీకి కూడా రెమ్యునరేషన్ చెల్లించలేదని వచ్చిన వార్త చూసి షాక్ అయ్యాను. నేను రూపొందించే తదుపరి చిత్రంలో కైరా నటిస్తున్నది. ఈ వార్త చూసి ఆమె షాక్ తిన్నారు. ఒకవేళ డబ్బుల చెల్లించకపోతే వారు తిరిగి ఎలా చేస్తారు అని దానయ్య నిలదీశారు.

రెమ్యునరేషన్ వివాదంపై కొరటాల
రెమ్యునరేషన్ వివాదంపై కొరటాల స్పందిస్తూ దానయ్యకు అండగా నిలిచారు. తనకు రెమ్యునరేషన్ చెల్లించలేదని వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం. సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాత నా రెమ్యునరేషన్‌ను చెల్లించారు. తన రెమ్యునరేషన్ ఆపలేదు అని కొరటాల పేర్కొన్నారు.

రామానాయుడు తర్వాత ఆయనే
నిర్మాతగా డీవీడీ దానయ్య గొప్ప వ్యక్తి. రామానాయుడు తర్వాత అంత మనసు ఉన్న నిర్మాతల్లో ఆయన ఒకరు. డబ్బుల విషయంలో ముందు, వెనుకా ఆలోచించరు. ప్రతిష్ఠాత్మకంగా మూడు భారీ చిత్రాలు రూపొందిస్తున్నారు. ఒకవేళ రెమ్యునరేషన్ చెల్లించకపోతే భారీ బడ్జెట్ చిత్రాలను ఎలా చేస్తారు అని కొరటాల పేర్కొన్నారు. ఎలా చేస్తారని ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











