వైట్ అండ్ వైట్‌తో అదరగొట్టిన డీవీవీ, రాంచరణ్!
టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న నిర్మాతల్లో డీవీవీ దానయ్య ఒకరు. తాజాగా భరత్ అనే నేను చిత్రంతో కెరీర్‌లోనే అత్యంత భారీ వసూళ్లు సాధించారు. డీవీవీ దానయ్య నిర్మాణ సారథ్యంలో రూపొందిన భరత్ అనే నేను రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో బోయపాటి దర్శకత్వంలో డీవీవీ మరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
రాంచరణ్, బోయపాటి సినిమా ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా బ్యాంకాక్‌లో నిర్మాత డీవీవీ దానయ్య, రాంచరణ్ ఇలా వైట్ అండ్ వైట్, అందమైన కళ్లజోళ్లు ధరించి కెమెరాకు ఫొజిచ్చారు. ఈ ఫోటోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తున్నది.

బోయపాటితో చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళితో మరో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
More from Filmibeat
dvv danaiah ram charan boyapati srinu rc12 tollywood డీవీవీ దానయ్య రాంచరణ్ బోయపాటి శ్రీను ఆర్సీ 12 టాలీవుడ్


Click it and Unblock the Notifications











