సంక్రాంతికి బొమ్మ పడదు.. రాంచరణ్ మూవీపై రూమర్లు.. నిర్మాత దానయ్య ట్వీట్!
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంపై కొద్దిరోజులుగా మీడియాలో అవాస్తవ కథనాలు వస్తున్నాయి. RC12 సినిమా సంక్రాంతికి రిలీజ్ కాదు అనే విధంగా వస్తున్న కథనాలపై నిర్మాత డీవీవీ దానయ్య వివరణ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..

రిలీజ్‌పై వివరణ
తన కెరీర్‌లో 12వ చిత్రం కోసం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో రాంచరణ్ జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని షూటింగ్ ప్రారంభం రోజునే దానయ్య స్పష్టం చేశారు. రిలీజ్‌పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు.

RC12పై రూమర్ల గురించి
అయితే సంక్రాంతికి RC12 మూవీ రిలీజ్ కావడం కష్టమే. సినిమా షూటింగ్ ఇంకా నెలరోజులపాటు మిగిలి ఉంది. ప్రొడక్షన్ పనులు ఆలస్యం వలన ఇప్పటి వరకు 70 శాతమే షూటింగ్ పూర్తయింది. కాబట్టి సంక్రాంతికి రాకపోవచ్చు అనే కథనాలు మీడియాలో కనిపించాయి.
డీవీవీ దానయ్య ట్వీట్‌తో
RC12పై వస్తున్న రూమర్లపై నిర్మాత డీవీవీ దానయ్య ట్వీట్ చేశారు. కొన్ని అవాస్తవ కథనాలు మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారమే సంక్రాంతికి RC12 రిలీజ్ అవుతుంది. త్వరలోనే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తాం అని దానయ్య ట్వీట్‌లో పేర్కొన్నారు.

చెర్రీతో కైరా, వివేక్ ఒబెరాయ్
హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ నటిస్తున్నాడు. రాంచరణ్ సరసన భరత్ అను నేను ఫేం కైరా అద్వానీ కనిపించనున్నారు. ప్రశాంత్, స్నేహ తదితరులు మిగితా పాత్రల్లో కనిపిస్తారు.


Click it and Unblock the Notifications











