రూ. 100 కోట్లిస్తాం రాజమౌళి సినిమా వదిలేయ్....నిర్మాతకు దిమమ్మదిరిగే ఆఫర్?

Recommended Video

DVV Danayya Rejects Rs 100 Crore Offer...?

బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా కోసం కేవలం తెలుగు వారు మాత్రమే కాదు...దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాజమౌళి భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు.

ఎన్టీఆర్- రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం #ఆర్ఆర్ఆర్ పేరుతో పిలుస్తున్నారు. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి దానయ్యకు ఒక ఊహించని ఆఫర్ వచ్చిందట.

రూ. 100 కోట్లు ఇస్తాం వదిలేయ్

రూ. 100 కోట్లు ఇస్తాం వదిలేయ్

రూ. 100 కోట్లు ఇస్తాం, ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని, దాన్ని మాకు అప్పగించాలని డివివి దానయ్యకు బడా నిర్మాతల నుండి దమ్మదిరిగే ఆఫర్ వచ్చినట్లు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంకా సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండటం, రామ్ చరణ్-ఎన్టీఆర్ తప్ప ఇంకా ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ ఫైనల్ కాలేదు కాబట్టి నువ్వు తప్పుకోవడం వల్ల ఎలాంటి సమస్య రాదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారట.

ఈ ఆఫర్ ఇచ్చింది ఎవరు?

ఈ ఆఫర్ ఇచ్చింది ఎవరు?

డివివి దానయ్యకు ఈ ఆఫర్ బడా నిర్మాతలైన ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నుంచి వచ్చినట్లు రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఇద్దరు గతంలో రాజమౌళి దర్శకత్వంలో వందల కోట్ల ఖర్చుతో బాహుబలి చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రూమర్స్‌లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

ఆఫర్ తిరస్కరించిన దానయ్య

ఆఫర్ తిరస్కరించిన దానయ్య

అయితే ఈ ఆఫర్ డివివి దానయ్య నిర్మొహమాటంగా తిరస్కరించారట. రాజమౌళితో ఒక పెద్ద సినిమా చేయాలని దానయ్య కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. తన కల ఇప్పటికీ నిజం అవుతండటంతో డబ్బు కోసం ఈ ప్రాజెక్టును వదులుకోవడానికి సిద్ధంగా లేని తేల్చి చెప్పారట.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దానయ్య

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దానయ్య

రాజమౌళి తాను తెరకెక్కించిన బాహుబలి చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్-రామ్ చరణ్‌తో తీయబోయే చిత్రం కూడా నేషనల్ లెవల్ ప్రాజెక్ట్. దీంతో ఈ ప్రాజెక్టును దానయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X