నిర్మాత డీవీవీ దానయ్య తనయుడు హీరోగా “అధీరా” ఫస్ట్ స్ట్రైక్.. దానయ్య గట్టి ప్లానే వేశారుగా!
తెలుగు సినిమాల్లో వారసులు ఈ మధ్య ఎక్కువ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మధ్యనే దిల్ రాజు సోదరుడు కుమారుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో నిర్మాత వారసుడు కూడా సినీ రంగంలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరా నిర్మాత? ఎవరా హీరో? అనే వివరాల్లోకి వెళితే

RRR చేతుల మీదుగా
ప్రముఖ నిర్మాత, RRR తో ప్రేక్షకులందరినీ ఆకట్టుకోబోతున్న డీవీవీ దానయ్య తన తనయుడు కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. అధీరా అంటూ ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ లాంటి ఒక వీడియో విడుదల చేశారు. అది కూడా ఈ వీడియోను RRR త్రయం ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు.

బడా నిర్మాత కొడుకు అయినా
ఫస్ట్ స్ట్రైక్ అంటూ వచ్చిన ఈ టీజర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. అంతే కాదు అంతటి బడా నిర్మాత కొడుకు అయినా ఈ సినిమాను ప్రశాంత్ వర్మ తన సొంత సినిమాటిక్ యూనివర్స్ బ్యానర్ కింద నిర్మిస్తున్నారు. కే నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజులో ప్లాన్ చేశారు.

ప్రధాన హైలైట్
ఇక ఈ సినిమాలో కళ్యాణ్ దాసరి ఓ సూపర్ హీరోగా కనిపించబోతున్నారని టీజర్ ద్వారా అర్థం అవుతోంది. అంతేకాదు చనిపోయిన వారిని కూడా బతికించే సూపర్ హీరోగా కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ఇక విడుదలైన వీడియోలో మ్యూజిక్ కూడా ప్రధాన హైలైట్ అని చెప్పవచ్చు. ఇక ఒక రకంగా ఈ సినిమా టైటిల్ కేజీఎఫ్ ను కూడా గుర్తు చేస్తోంది.

ఎంట్రీని ప్లాన్
ఎందుకంటే కేజీయఫ్ 2లో విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ పాత్ర పేరు అదే. ఆ లెక్కన దానయ్య టైటిల్ తో కేజీఎఫ్ క్రేజ్ ను, RRR త్రయం ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయించడం ద్వారా RRR క్రేజ్ ను కూడా వాడుకుంటున్నారు. అలా మొత్తం మీద కళ్యాణ్ గట్టిగా ఎంట్రీని ప్లాన్ చేశాడని అర్థం అవుతోంది.

ఫస్ట్ స్ట్రైక్
ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్‌కి జోంబీ కాన్సెప్ట్‌ని పరిచయం చేసిన తర్వాత ప్రశాంత్ వర్మ మొదటి ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో సినిమా హను-మాన్ చిత్రాన్ని తెరకెక్కి్స్తున్నాడు. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఇక 'అధిర ఫస్ట్ స్ట్రైక్' విషయానికి వస్తే అసలైన సూపర్‌హీరో సూపర్ పవర్‌లను వీడియోలో చూపించారు. విజువల్స్ అయితే హాలీవుడ్ స్టాండర్డ్‌తో సమానంగా ఉన్నాయి. అలా ఈ ఫస్ట్ స్ట్రైక్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుందనే చెప్పాలి. ఈ సినిమాకు గౌరీ హరి సంగీతం అందిస్తుండగా, దాశరథి శివేంద్ర కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











