Samatha తో డీవీవీ దానయ్య కొడుకు పెళ్లి.. ఎవరెవరు హాజరవుతున్నారంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో అనేకమంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అలాంటి వారిలో డీవీవీ దానయ్య ఒకరు. దానయ్య పూర్తి పేరు దాసరి వీర వెంకట దానయ్య. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై మూడు దశాబ్దాలుగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికీ 20కిపైగా సినిమాలు నిర్మించిన దానయ్య ఇటీవల RRR సినిమాకు గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. అయితే డీవీవీ దానయ్య కొడుకు కల్యాణ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వం: టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన డీవీవీ దానయ్య కుమారుడు దాసరి కల్యాణ్ త్వరలో హీరోగా తెరంగేట్రం కానున్న విషయం తెలిసిందే. అధీరా అనే ఈ సినిమాతో వచ్చే ఏడాది చాలా గ్రాండ్ గా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కల్యాణ్. ఈ సినిమాను ఆః, జాంబిరెడ్డి, హను-మాన్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారు.

హీరోగా ఎంట్రీకి ముందే: దానయ్యే నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ టీజర్ వీడియో ఒకటి అప్పట్లో వదిలారు. సూపర్ హీరో కథగా వస్తున్న ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సాధారణంగా హీరోలుగా సక్సెస్ అయ్యాకా పెళ్లి పీటలు ఎక్కుతారు. కానీ దానయ్య కుమారుడు కల్యాణ్ మాత్రం హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.

మే 20న వైభవంగా: డీవీవీ దానయ్య కొడుకు కల్యాణ్ పెళ్లి వేడుకకు హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ వేదిక కానుంది. మే 20న అంటే శనివారం రోజున రాత్రి 9 గంటల 48 నిమిషాలకు ముహుర్తం ఖరారు చేశారు. అయితే దాసరి కల్యాణ్ పెళ్లి వేడుకలు రాత్రి 8 గంటల నుంచే ప్రారంభం కానున్నాయి. రాత్రి 8 గంటల నుంచి అతిథులు హాజరుకానున్నారు.

అతిరథ మహారథులు: దాసరి కల్యాణ్ పెళ్లి వేడుకకు టాలీవుడ్ అతిరథ మహారథులు హాజరు కానున్నారు. వీరిలో దర్శక దిగ్గజం రాజమౌళి కుటుంబం అంటే రమా దేవి, కార్తికేయ, ఎమ్ఎమ్ కీరవాణి, మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారను తెలుస్తోంది.

సమతతో కల్యాణ్ పెళ్లి: ఇదిలా ఉంటే దానయ్య కుమారుడు కల్యాణ్ చేసుకునే అమ్మాయి ఎవరా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆమె పేరు సమత. సమంత పేరులా ఉండే సమతను చూసి చాలా మంది నెటిజన్లు కన్ఫ్యూజ్ కావడం హాట్ టాపిక్ అయింది. అయితే సమతకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ఏం తెలియరాలేదు. కాగా దానయ్య ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో సుజీత్ దర్శకత్వంలో ఓజీ (OG) సినిమా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











