లుంగీలో డ్వైన్ బ్రేవో స్పెప్పులేస్తే ఇలా....(ఫోటోలు)
చెన్నై: వెస్టిండీస్ క్రికెటర్ డ్వైన్ బ్రేవో 'ఉల' అనే తమిళ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డ్రీమ్‌బ్రిడ్జి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎల్వీ శ్రీకాంత్ లక్ణ్మణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజన్ మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రేవో ఓ స్పెషల్ సాంగులో కనిపించబోతున్నాడు.
ఇటీవలే చెన్నైలో బ్రేవోపై సాంగు చిత్రీకరించారు. తమిళ సాంప్రదాయ వస్త్రధారణలో బ్రేవో వేసిన మాస్ స్టెప్పులు సినిమాకు హైలెట్ కానున్నాయి. తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా మీడియాకు విడుదల చేసారు. మొత్తానికి డ్వైన్ బ్రేవో ద్వారా ఆ సినిమా మంచి పబ్లిసిటీ దక్కుతోంది.
'ఉల' సినిమా విషయానికొస్తే....ఇదొక థ్రిల్లర్ మూవీ. 48 గంటల్లో సాగే నాలుగు డిఫరెంటు స్టోరీల చుట్టూ కథ తిరుగుతుంది. సరికొత్త కథాంశం, స్ర్కీన్ ప్లేతో ఆద్యంతం ఆసక్తిగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు చిత్ర దర్శకుడు రాజన్ మాధవ్. యూత్‌కు నచ్చేలా వినోదాత్మకంగా సినిమా ఉంటుంది.
స్లూడ్ షోలో బ్రేవో ఫోటోలు....

స్టెప్పు అదిరింది
డ్వైన్ బ్రేవో ‘ఉల' మూవీ సాంగులో స్టెప్పులు ఇరగ దీసాడు. బ్రేవోకు కేవలం క్రికెట్ తప్ప మరేమీ రాదనుకుంటే పొరపాటే. ఆయన మంచి డాన్సర్ కూడా. క్రీడా మైదనాంలో కూడా తరచూ స్టెప్పులే వేస్తూ ఆడియన్స్‌ను ఉత్సాహ పరుస్తుంటాడు బ్రేవో.

సాధన చేస్తున్న బ్రేవో
కెమెరా ముందు డాన్స్ చేసే ముందు డాన్స్ మాస్టర్ ఆధ్వర్యంలో లుంగీలో డాన్స్ చేయడం ఎలాగో సాధన చేస్తున్న బ్రేవో. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

సులభంగా...
బ్రేవోకు అసలు సౌతిండియా డాన్స్ మాస్ డాన్స్ అసలు తెలియదు. అయినా సరే ఆ స్టెప్పులను చాలా సులభంగా నేర్చుకున్నాడు బ్రేవో. ఆకట్టుకునే విధంగా స్టెప్పులేసారు.

మూమెంట్ అదిరింది
‘ఉల' సినిమాలో డ్రేవో ఎంత పర్ ఫెక్టుగా డాన్స్ చేసాడో ఈ ఫోటో చూస్తే స్పష్టం అవుతుంది. బ్రేవో సాంగ్ సినిమాకు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉంటుందని, సినిమాక హైలెట్ అవుతుందని దర్శక నిర్మాతలు అంటున్నారు.

సినిమాలో ఎవరెవరు
ఈ చిత్రంలో అజ్మల్, రాధిక ఆప్టే, విధార్థ్, గ్వాతెరి శంకర్, అశోక్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాజన్ మాధవ్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్ బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బేనర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

థ్రిల్లర్ మూవీ
ఇదొక థ్రిల్లర్ మూవీ. 48 గంటల్లో సాగే నాలుగు డిఫరెంటు స్టోరీల చుట్టూ కథ తిరుగుతుంది. సరికొత్త కథాంశం, స్ర్కీన్ ప్లేతో ఆద్యంతం ఆసక్తిగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు చిత్ర దర్శకుడు

పుట్టినరోజు నాడే
డ్వైన్ బ్రోవో తన 30 జన్మదినం రోజు సోమవారం తమిళ సినిమా ఉలా షూటింగ్‌లో పాల్గొన్నాడు. తాను షూటింగ్‌లో పాల్గొనడానికి ముందు ఆ విషయంపై ఆయన ట్వీట్ చేశాడు. ఈ రోజు షూటింగ్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నానని, తన జన్మదినాన్ని ఇలా జరుపుకోవడం గొప్పగా ఉందని ఆయన అన్నాడు.

బ్రేవో
తమిళనాడు ప్రజలకు బ్రేవో బాగా తెలుసు. అతను ఐపియల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నాడు. మంచి ఆటగాడే కాకుండా డ్యాన్సర్ కూడా. ఇప్పుడు తన సెకండ్ హోమ్‌గా అనిపిస్తోందని, ఈ అవకాశం తన ఏజెంట్ కల్పించినప్పుడు థ్రిల్లయ్యానని, ఐపియల్ జట్టు సభ్యుడిగా చెన్నైతో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయన మీడియా సమావేశంలో బ్రేవో అన్నాడు.


Click it and Unblock the Notifications











