అందుకే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: ది రాక్
అమెరికన్ నటుడు, ప్రొఫెషనల్ రెజ్లర్ డ్వేన్ జాన్సన్ (ది రాక్) గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2020 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే తన నిర్ణయం మార్చుకున్నానని, ప్రస్తుతం ఆ ఆలోచన విరమించుకున్నట్లు తన తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
తన తాజా సినిమా 'జుమాంజి-వెల్ కం టు ది జంగల్' సినిమా ప్రమోషన్లో భాగంగా తన కోస్టార్స్ కెవిన్ హార్ట్, జాక్ బ్లాక్ తదితరులతో కలిసి 'ది గ్రాహమ్ నార్టన్ షో'లో పాల్గొన్న డ్వేన్ జాన్సన్‌కు.... ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
2020లో మీరే అమెరికా ప్రెసిడెంట్ అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు అనే ప్రశ్నకు ది రాక్ స్పందిస్తూ..... ఇలాంటి విషయంలో ప్రజల అభిప్రాయాలు ముఖ్యం. కెవిన్ హార్ట్ లాంటి వ్యక్తులు స్పందిస్తున్న తీరు వల్లే తాను ఈ ఆలోచన విరమించుకున్నట్లు తెలిపారు.
ఈ షోలో డ్వేన్ జాన్సన్‌తో పాటు పాల్గొన్న హాలీవుడ్ కమెడియన్ కెవిన్ హార్ట్ మధ్యలో కల్పించుకుని..... 'నువ్వు ప్రెసిడెంట్ కావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అలా జరిగితే నువ్వు నాకంటే ఎదిగిపోతావు... అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











