అనుష్క కూడా ఓ రాయి విసురుతోంది
హైదరాబాద్: సౌత్ లో హీరోయిన్ గా ఓ స్ధాయికి వెళ్లిన వాళ్లంతా బాలీవుడ్ పై కన్నేయటం సహజం. అక్కడ సక్సెస్ అయితే అవుతాం..లేదా మన సౌత్ సినిమాలు ఉండనే ఉన్నాయి...అనేది వారి ఆలోచన. బాలీవుడ్ లో నటిస్తే దేశం మొత్తం పాపులర్ అవుతామనేది వారి ఆలోచన. త్రిష,అశిన్, కాజల్, తమన్నా రూటులోనే ఇప్పుడు అనుష్క కూడా బాలీవుడ్ ప్రయాణం పెట్టుకుందని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే...అనుష్క ఓ బాలీవుడ్ సినిమాను అంగీకరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 'అమన్ కి ఆశ' చిత్రాన్ని రూపొందించిన ఇ.నివాస్ తన తదుపరి చిత్రంలో అనుష్కను బాలీవుడ్‌కు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

''నేను అనుష్కకు ఓ కథ వినిపించాను. ఆమెకు చాలా బాగా నచ్చింది. ఏదైనా అనుష్క నుంచి ఓకే అనే మాట వచ్చాకే చెప్పగలను. ఈ కథకు అనుష్క వందశాతం సరిపోతుందని ఆమెను సంప్రదించాను. ఈ నెలాఖరుకు ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి రావచ్చు''అని చెప్పారాయన.
సినిమా గురించి చెబుతూ ''ఈ చిత్రానికి 'జువీనల్' అనే పేరు ఖరారు చేశాం. మల్టీస్టారర్ చిత్రం. మహిళా ప్రాధాన్య చిత్రం కాదు. భిన్న కథల సమ్మేళనంగా సాగుతుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది''అని చెప్పారు నివాస్. అనుష్క ప్రస్తుతం 'బాహుబలి' చిత్రీకరణలో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











