twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విశ్వరూపం ఎఫెక్ట్ : సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : విశ్వరూపం చిత్రాన్ని నిలిపి వేస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో సినిమాలను అడ్డుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా చట్ట సవరణలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రాష్ట్రానికి స్వంత సెన్సార్ బోర్డు ఉండకూడదు అంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి మనీష్ తివారీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

    ''సినిమాటోగ్రఫీ చట్టాన్ని మరోసారి పరిశీలించి సెన్సార్ సర్టిఫికేషన్‌కు సంబంధించి సవరణలు చేయాల్సిన సమయం వచ్చింది. ప్రతి రాష్ట్రానికి సొంత సెన్సార్ బోర్డు ఉండకూడదు'' అంటూ మనీష్ తివారీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే 'విశ్వరూపం' చిత్రం పట్ల తమిళనాడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం....ఇక ముందు మళ్లీ రిపీట్ కాకుండా అడ్డుకోవాలనే విషయం స్పష్ట అవుతోంది.

    కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా తమిళనాడు ప్రభుత్వ తీరుపై ఘాటుగానే స్పందించారు. మనం స్వేచ్ఛా సమాజంలో ఉన్నాం, భావ ప్రకటన స్వేచ్చ ఉందని వ్యాఖ్యానించారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం కమల్ హాసన్ కు మద్దతుగా నిలవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

    కాగా...ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 'విశ్వరూపం' చిత్రాన్ని నిలిపివేయడాన్ని సమర్థించుకున్నారు. అదే విధంగా మీడియా తమిళనాడు ప్రభుత్వ తీరును తప్పుబట్టడాన్ని కూడా ఆమె ఖండించారు. విశ్వరూపం సినిమాను తమిళనాడు ప్రభుత్వం నిషేధించడానికి సరైన కారణాలు ఉన్నాయనిన్నారు.

    శాంతిభద్రతల దృష్ట్యానే సినిమాను నిలిపివేశామని, రాష్ట్రంలో పలు ముస్లిం సంఘాలు విశ్వరూపం సినిమాను నిలిపేయాలని ప్రభుత్వాన్ని కోరాయన్నారు. అందుకే శాంతిభద్రతల దృష్ట్యా నిలిపి వేసినట్లు చెప్పారు. ప్రభుత్వం తప్పన్నట్లుగా మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. సినిమాను ముస్లిం సంఘాలు వ్యతిరేకించినందున.. థియేటర్ల వద్ద హింస చోటు చేసుకుంటే దానికి బాధ్యులెవరని ఆమె ప్రశ్నించారు.

    English summary
    Against the backdrop of controversy surrounding Kamal Haasan's film 'Vishwaroopam', Information and Broadcasting Minister Manish Tewari today said there was a need to "revisit" the Cinematograph Act to ensure decisions of the Censor Board are implemented. "Time-cinematographic act revisited to ensure implementational integrity (of) certification decisions, otherwise each state would be its own censor (board)," Tewari posted on the social networking website Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X