ఇచ్చిన మాట నిలబెట్టుకో దిల్‌రాజు.. సోలోగా వచ్చేందుకు అనుమతి ఇవ్వు.. ఈగల్ మూవీ టీం లేఖ!
అద్భుతమైన నటనతో అందరి చేతే ఆహా అనిపించుకునే రవితేజ అటు కామెడీతో పాటు ఇటు మాస్ యాక్టింగ్ చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. అయితే తాజాగా ఈయన ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. సంక్రాంతి సందర్భంగా రావాలనుకున్నప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. అయితే సోలోగా వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ అదే రోజు మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతుండడంతో చిత్రబృందం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు లేఖ రాసింది. ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మాస్ మహారాజా రవితేజ హీరోగా రాబోతున్న ఈగల్ సినిమాకు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్ తో పాటు కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించున్నారు. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా అంటే జనవరి 13వ తేదీన విడుదల చేయాలని ముందుగా చిత్రబృందం ప్లాన్ చేసుకుంది. కానీ అదే సమయంలో చాలా సినిమాలు విడుదల కావడంతో.. ఫిల్మ్ ఛాంబర్ మాట ప్రకారం ఈ సినిమాను వాయిదా వేశారు.

ముఖ్యంగా ఓ ప్రముఖ ప్రొడ్యూసర్ (దిల్ రాజు) సూచన మేరకు.. సోలోగా వచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో సందడి చేయాలని డిసైడ్ అయ్యారు. అదే విషయాన్ని ప్రకటించారు కూడా. అయితే ఫిబ్రవరి 9వ తేదీన వేరే సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఈగల్ మూవీ టీం ప్రొడ్యూసర్లు... తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కు లేఖ రాశారు. తాము సోలోగా వచ్చేందుకు అనుమతి కావాలంటూ ఆ లేఖలో కోరారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం దాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు.
సినిమాను వాయిదా వేసుకోమని ప్రముఖ ప్రొడ్యూసర్ (దిల్ రాజు), ఫిల్మ్ ఛాంబర్ చెప్పడం వల్లే తాము ఈగల్ చిత్రాన్ని వాయిదా వేశామని లేఖలో వివరించారు. అయితే ఆరోజు ఫిల్మ్ ఛాంబర్.. తమకు సోలోగా వచ్చేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపిందని.. ఇలా చెప్పడం వల్లే తాము ఆ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కానీ తాము సినిమాను విడుదల చేయబోతున్న రోజు వేరే సినిమాలు కూడా విడుదల అవుతున్నాయని.. దాన్ని దృష్టిలో ఉంచుకుని తమ సినిమా సోలోగా వచ్చేలా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు.

మరి దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఏ విధంగా స్పందించనుందో చూడాలి. ముఖ్యంగా ఫిబ్రవరి 9వ తేదీనే సందీప్ కిషన్ హీరోగా చేసిన ఊరు పేరు భైరవకోన చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. చూడాలి మరి ఏ సినిమా ఏరోజు విడుదల అవుతుంది.. మాస్ మహారాజా సినిమాకు సోలోగా వచ్చేందుకు అనుమతి వస్తుందా లేదా అనేది. పూర్తి వివరాలు తెలియాలంటే మరో రెండు మూడు రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











