twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నడుం ఊపగలిగే వాళ్ళకే ఇక్కడ ఇంపార్టెన్స్ : సోనాలీ బింద్రే

    తాజాగా హైద్రాబాద్ లో జరిగన ఫిక్కీ లేడీస్ మీట్ లో పాల్గొన్న సోనాలి బింద్రే.. హీరోయిన్స్ పాత్రలతో తనకు వ్యక్తిగతంగా చాలా సమస్యలున్నాయని అంటోంది.

    |

    'ఇంద్ర" 'ఖడ్గం" 'మురారి" 'మన్మధుడు" 'శంకర్‌ దాదా ఎంబిబిఎస్" వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన సోనాలీ బింద్రే టాలీవుడ్ కి, హైదరాబాద్ కీ కొత్త కాదు. నిర్మాత గోల్డిబెల్ ను వివాహం చేసుకున్న తరువాత సినిమాలకు క్రమంగా దూరమైంది. తర్వాత అడపాదటపా వార్తల్లో తప్ప సినిమాల్లో కనిపించటం మానేసింది.

    అవసరమైనంత మేరకు తెలుగు

    అవసరమైనంత మేరకు తెలుగు

    తెలుగు తెరపై పెదాలు కదిపేందుకు అవసరమైనంత మేరకు తెలుగు నేర్చుకున్నానని చెప్పిన సోనాలి.. ఇక్కడి ప్రజలు ఆదరించిన తీరు ఎన్నటికీ గుర్తుండిపోతుందని చెప్పింది. తెలుగు సినిమా పరిశ్రమలో నాకు మంచి జ్ఞాపకాలున్నాయి. ఇక్కడ అందరూ ప్రొఫెషనల్‌గాఉండటమే కాదు సాఫ్ట్‌స్పోకెన్‌ పీపుల్‌.

    అలాంటి వారే నచ్చుతారు

    అలాంటి వారే నచ్చుతారు

    నాకు అలాంటి వారే నచ్చుతారు. కాబట్టి సహజంగానే ఈ ఇండస్ట్రీని ప్రేమిస్తాను. మరలా స్క్రీన్ పై వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేవు. పిల్లలతో బిజీగా ఉన్నాను. తరువాత ఏమవుతుందో చూడాలి. అంటూ చెప్పిన సోనాలి బింద్రే. ఈ మధ్య హీరోయిన్లు తమ అస్తిత్వం మీదా బాగానే స్పందిస్తున్నారు. పనిలో పనిగా తానూ గొంతు కలిపేసింది సోనాలీ.

    నడుం బాగా ఊపగలిగే వాళ్ళకే ఇంపార్టెన్స్

    నడుం బాగా ఊపగలిగే వాళ్ళకే ఇంపార్టెన్స్

    తాజాగా హైద్రాబాద్ లో జరిగన ఫిక్కీ లేడీస్ మీట్ లో పాల్గొన్న సోనాలి బింద్రే.. హీరోయిన్స్ పాత్రలతో తనకు వ్యక్తిగతంగా చాలా సమస్యలున్నాయని అంటోంది. ' చక్కటి లుక్స్ తో.. నడుం బాగా ఊపగలిగే వాళ్ళకే ఇంపార్టెన్స్ ఉంటుంది. మూవీ మేకర్స్ అంతకు మించి మమ్మల్ని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించరు.

    మమ్మల్ని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించరు

    మమ్మల్ని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించరు

    అందుకే నేను రచయితగా.. ఆ ఇమేజ్ నుంచి.. ఆ ప్రభావం నుంచి దూరంగా ఉండాలని అనుకుంటాను.. అదే చేస్తున్నాను' అంటూ తన మనసులోని మాటని బయటపెట్టింది. సోనాలీ బింద్రే రాసిన ''ది మోడర్న్‌ గురుకుల్‌ - మై ఎక్స్‌పెరిమెంట్‌ విత్‌ పేరెంటింగ్‌' అంటూ సోనాలీ రాసిన పుస్తక బెస్ట్ సెల్లర్గా నిలిచిన విషయం తెలిసిందే.

    వెంటాడుతున్న కల

    వెంటాడుతున్న కల

    'యాక్ట్రెస్ అంటే గ్లామర్ పర్సనాలిటీ. నాలో ఉన్న ఆ యాంగిల్ నాకు నచ్చినదే అయినా. రైటర్ గా మాత్రం ఆ ఇమేజ్ కి దూరంగా ఉంటాను. చిన్నప్పటి నుంచి పుస్తకాలతో ఎక్కువ సహవాసం చేశాను' అని చెప్పింది సోనాలి బింద్రే. అతి పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయడం ఈమెకు సుదీర్ఘకాలంగా వెంటాడుతున్న కల అంటోంది.

    English summary
    “Today’s actresses strip at the drop of the hat; they seem to think that acting is nothing but skin-show. It’s because of these actresses that the standard of Indian cinema has come down by several notches in the past few years,” said Sonali
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X