ఐటం సాంగులకు టాప్ హీరోయిన్ల రేట్లు...(ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: ఐటం సాంగులు అనేవి ప్రస్తుతం ప్రతి సినిమాలోనూ తప్పనిసరిగా మారాయి. ప్రేక్షకులు కోరుకుంటున్న అంశాల్లో ఐటం సాంగుకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో దర్శక, నిర్మాతలు ప్రతి సినిమాలోనూ మసాలా సాంగు ఉండేలా చూసుకుంటున్నారు. గతంలో ఐటం సాంగులు చేయడానికి ప్రత్యేకంగా బి-గ్రేడ్ తారలు ఉండే వారు. వీరు చాలా తక్కువ రేటుకే ఐటం సాంగులు చేసే వారు.

అయితే ప్రస్తుతం ట్రెండు మారింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కల్పించేందుకు స్టార్ హీరోయిన్లను సైతం ఐటం సాంగులు చేయడానికి ఒప్పిస్తున్నారు. ఇందుకోసం వారికి కోట్లలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారు. రోజుల తరబడి షూటింగులో పాల్గొంటే వచ్చే మొత్తం ఒక ఐటం సాంగు పూర్తి చేస్తే వస్తుండటంతో పలువురు స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

బాలీవుడ్లో టాప్ 10 పొజిషన్లో కొనసాగుతున్న స్టార్ హీరోయిన్లు కత్రినా కైఫ్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా లాంటి వారు సైతం ఇలాంటి చేస్తుండటంతో ఐటం సాంగులు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఇలాంటి స్పెషల్ ఐటం నెంబర్స్ చూడటానికి ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఇప్పటి వరకు చేసిన ఐటం సాంగులకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే దానిపై ఓ లుక్కేద్దాం.....

చిత్రాంగద సింగ్...

చిత్రాంగద సింగ్...

బాలీవుడ్ హీరోయిన్ చిత్రాంగద సింగ్ అక్షయ్ కుమార్ హీరోగా 2012లో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘జోకర్'లో....ఐటం సాంగు చేసినందుకు రూ. 80 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

జాక్వెలిన్ ఫెర్నాండెజ్

ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ మూడీ ‘రామయ్యా వస్తావయ్యా'(నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి రీమేక్) చిత్రంలో ఐటం సాంగ్ చేసినందుకు రూ. 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకుంది జాక్వెలిన్ పెర్నాండెజ్.

మలైకా అరోరా ఖాన్

మలైకా అరోరా ఖాన్

దబాంగ్ చిత్రంలో ‘మున్ని బదనాం హుయే' ఐటం సాంగ్ చేసినందుకు రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది మలైకా అరోరా ఖాన్.

సన్నీ లియోన్

సన్నీ లియోన్


సన్నీ లియోన్ బాబీ డాల్ ఐటం సాంగ్ చేసినందుకు రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట.

మల్లికా షెరావత్

మల్లికా షెరావత్

బాలీవుడ్ మూవీ ‘డబుల్ ధమాల్' చిత్రంలో జిలేబీ బాయి ఐటం సాంగు చేసినందుకు రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది మల్లికా షెరావత్.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్

అగ్నిపథ్ చిత్రంలో ‘చికినీ చమేలి' ఐటం సాంగు చేసినందుకు రూ. 3.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది కత్రినా కైఫ్.

కరీనా కపూర్

కరీనా కపూర్

హీరోయిన్ కరీనా కపూర్ హల్ కత్ జవానీ ఐటం సాంగు చేసినందుకు రూ. 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట.

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా

హీరోయిన్ సోనాక్షి సిన్హా పార్టీ ఆల్ నైట్ అనే స్పెషల్ సాంగ్ చేసినందుకు రూ. 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘రామ్ లీలా' చిత్రంలో ఐటం సాంగ్ చేసినందుకు రూ. 6 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X