కూతురు గురించి మెగాస్టార్ మదిలో ఆందోళన!
ముంబై: తల్లిదండ్రులు తమ బిడ్డలపై ప్రేమ, ఆప్యామయత చూపించినట్లుగా...ఈ లోకంలో మరెవరూ చూపించరు. సామాన్యుడైనా, ధనవంతుడైనా, సినిమా సెలబ్రిటీలైనా ఈ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఏమైనా అనుకోని సంఘటనలు జరిగిన చోట తమ పిల్లలు ఉంటే తల్లిదండ్రులు పడే ఆందోళన మాటల్లో చెప్పడం కష్టం. వారి క్షేమ సమాచారం తెలుసుకునే వారి మనసు కుదుట పడదు.
తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా తన కూతురు శ్వేతా విషయంలో ఇలాంటి ఆందోళనకే గురయ్యారు. ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త నిఖిల్ నందాను పెళ్లాడిన శ్వేతా ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు నవ్య నవేలి, అగస్త్యాతో కలిసి ఉంటోంది. ఇటీవల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.
ఇండియన్ మెటోరోలాజికల్ రిపోర్టు ప్రకారం భూమి కంపనాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1 నమోదైంది. భూమికంపిచన విషయం తెలియగానే అమితాబ్ బచ్చన్ కంగారు పడిపోయారు. అయితే శ్వేతకు ఫోన్ చేసిన వారు క్షేమంగానే ఉన్నారనే విషయం స్వయంగా తెలుసుకున్న తర్వాత ఆయన మనసు కాస్త కుదుట పడింది.
తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అభిమానులతో పంచుకునే అమితాబ్ బచ్చన్ ఈ విషయాలను కూడా వెల్లడించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అమితాబ్‌కు తన కూతురుపై ఎంత ప్రేమ ఉందో!


Click it and Unblock the Notifications












