twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోసాని ఇరుక్కుపోయాడా.. ఎన్నికల సంఘం సీరియస్, 'కమ్మ' వ్యాఖ్యల ఎఫెక్ట్!

    |

    దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళికి చిక్కులు మొదలయ్యాయి. ఇటీవల మీడియా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన తీవ్ర విమర్శలతో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. కులాల పేర్లు ప్రస్తావిస్తూ పోసాని కృష్ణ మురళి చంద్రబాబుని విమర్శించారు. పోసాని తెరక్కించబోయే 'ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు' చిత్రం విషయంలో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని టీడీపీకి వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారు అని ఆ పార్టీకి నాయకులు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. దీనితో ఎన్నికల సంఘం పోసానికి నోటీసులు పంపింది. టిడిపి చర్యపై పోసాని సోమవారం మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబుపై రెచ్చిపోయారు. తన వ్యాఖ్యలతో పోసాని మరోమారు వివాదంలో చిక్కుకున్నారు.

    ఒక్క సీన్ కూడా చూడకుండా

    ఒక్క సీన్ కూడా చూడకుండా

    తాను తెరకెక్కిస్తున్న 'ముఖ్యమంత్రిగారు మాటిచ్చారు' చిత్రంలోని ఒక్క సన్నివేశం కూడా చూడకుండా ఈసీకి ఎలా పిర్యాదు చేస్తారని పోసాని ఫైర్ అయ్యారు. సెన్సార్ నిబంధనలు అనుగుణంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను అంటూ పోసాని వివరణ ఇచ్చారు. సినిమా గురించి ఎవరో తెలియని వ్యక్తి ఫిర్యాదు చేస్తే ఈ చిత్రాన్ని ఆపేయాలని అంటున్నారు. దీనిపై తాను కోర్టులో పోరాడతానని పోసాని తెలిపారు.

    సామజిక వర్గంపై కామెంట్

    సామజిక వర్గంపై కామెంట్

    చంద్రబాబుకు ఓటేస్తే కమ్మ దేశానికీ ఓటేసినట్లే, ఆయన నీచుడు ఈ తరహాలో పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని తెలుగు దేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. మరోమారు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నేనేమైన బ్రోకర్ పని చేస్తున్నానా.. ఎందుకు నా చిత్రం ఆపేయమంటున్నారు అంటూ పోసాని ఒకరేంజ్ లో మీడియా సమావేశంలో మండిపడ్డారు. నువ్వు దేశ ప్రధానికి రోజూ తిడుతున్నావ్..నీకు ఎన్నికల కోడ్ వర్తించదా అని పోసాని అన్నారు.

    నేనేంటో చూపిస్తా, నాకే ఎక్కువ హక్కు ఉంది, నా తమ్ముడు పులి: నాగబాబునేనేంటో చూపిస్తా, నాకే ఎక్కువ హక్కు ఉంది, నా తమ్ముడు పులి: నాగబాబు

    ఈసీ నోటీసులు

    ఈసీ నోటీసులు

    పోసాని చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది. విచారణ కొరకు ఎన్నికల సంఘం కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. పోసాని చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలని ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా అధికారులు భావిస్తే ఆయన మరింత చిక్కుల్లో చిక్కుకున్నట్లే.

    స్పందించిన పోసాని

    స్పందించిన పోసాని

    ఎన్నికల సంఘం నుంచి వచ్చిన నోటీసులపై పోసాని స్పందించారు. తాను చంద్రబాబుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. తాను ప్రస్తుతం నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చేరానని, అందువలన విచారణకు హాజరు కాలేనని అన్నారు. గత కొంతకాలంగా కాలి నొప్పితో భాదపడుతున్న పోసాని యశోద ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

    English summary
    EC Issues Notice to Posani Krishna Murali over His Comments on Chandrababu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X