twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంగోపాల్ వర్మకు మరో షాక్.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు ఎదురుదెబ్బ.. ఆంధ్రాలో రిలీజ్ కాకుండా..!

    |

    స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలో చోటుచేసుకొన్న కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా బయోపిక్ చిత్రాల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. దాంతో ఆంధ్రాలో మరో రెండు నెలలు ఈ సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

     పీఎం నరేంద్రమోదీ, లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు చుక్కెదురు

    పీఎం నరేంద్రమోదీ, లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు చుక్కెదురు

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీఎం నరేంద్రమోదీ, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాలపై వివాదం కొనసాగుతున్నది. పీఎం నరేంద్రమోదీ చిత్రాన్ని విడుదల కాకుండా ఆపాలని కాంగ్రెస్, ఇతర పార్టీలు, లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ఏపీలో రిలీజ్ కాకుండా ఆపాలనే టీడీపీ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్లను పరిశీలించిన ఈసీ దేశవ్యాప్తంగా బయోపిక్‌లపై నిషేధం విధించింది.

    ఎన్నికల సమయంలో నిషేధం

    ఎన్నికల సమయంలో నిషేధం

    బయోపిక్ చిత్రాల నిషేధంపై ఈసీ వివరణ ఇస్తూ.. ఏ రాజకీయ పార్టీకి, లేదా ఏ వ్యక్తి జీవితానికి సంబంధించిన ఏ బయోపిక్‌ను ఎన్నికల సమయంలో విడుదల చేయడానికి వీలు లేదు. ఈసీ ఆంక్షల నేపథ్యంలో సినిమాను ఎలక్ట్రానిక్ మీడియాలో గానీ, సినిమాటోగ్రాఫ్‌ను గానీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్రాంతాల్లో ప్రసారం చేయకూడదు అని స్పష్టం చేసింది.

    ఎన్నికల కోడ్ ఉన్నంత సేపు

    ఎన్నికల కోడ్ ఉన్నంత సేపు

    ఎన్నికల సంఘం ఆంక్షల నేపథ్యంలో వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం ఏపీలో విడుదలకు నోచుకోదు. వచ్చే 40 రోజులు అంటే ఎన్నికల ఫలితాలు పూర్తయ్యేంత వరకు ఈ చిత్రం విడుదల కాకుండా ఈసీ నిర్ణయం ప్రకటించింది.

     పైరసీ కోరల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ

    పైరసీ కోరల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ

    ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఏపీ మినహాయించి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. నైజాం, తమిళనాడు, కర్ణాటకలో ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఓవర్సీస్‌లో మెరుగైన వసూళ్లను సాధించింది. ఇప్పటికే ఈ చిత్రం పైరసీ బారిన పడింది. రిలీజ్ కోసం మళ్లీ 40 రోజులు ఆగితే ఈ సినిమా పరిస్థితి మరింత గందరగోళంగా మారే అవకాశం ఉంది.

    English summary
    Election Commision of India bans releasing biopics in Election time. In this occcassion it specifies that, "Any biopic material in nature of biography sub-serving the purpose of any political entity or any individual entity connected to it, which has potential to disturb level playing field during the election, should not be displayed in electronic media including cinematograph during the operation of MCC," the ECI said in its statement. This decision is shock to RGV for releasing Lakshmis NTR in AP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X