For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఇదేం దెయ్యం’ అంటు ర‌చ్చ ర‌వి, కిరాక్ ఆర్పీ కామెడీ

  By Rajababu
  |

  ఏ.వి ర‌మ‌ణ‌మూర్తి స‌మ‌ర్ప‌ణ‌లో చిన్మ‌య‌నంద ఫిల్మ్స్ ప‌తాకంపై ఎస్. స‌రిత నిర్మిస్తోన్న చిత్రం ఇదేం దెయ్యం. శ్రీనాధ్ మాగంటి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సాక్షి క‌క్క‌ర్ , ర‌చ‌న స్మిత్, రుచి పాండే నాయిక‌లు. ర‌చ్చ ర‌వి, కిరాక్ ఆర్.పి కీల‌క పాత్ర‌ధారులు. వి. ర‌వివ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిచ‌గా, బాలు స్వామి సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం శనివారం సాయంత్రం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్యక్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ సీడీల‌ను ఆవిష్క‌రించి యూనిట్ స‌భ్యుల‌కు అంద‌జేశారు.

  హారర్ సినిమాల ట్రెండ్‌కు తగినట్టుగా..

  హారర్ సినిమాల ట్రెండ్‌కు తగినట్టుగా..

  అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ` ప్ర‌స్తుతం హార‌ర్ సినిమాల ట్రెండ్ న‌డుస్తుంది. ఆ క‌మ‌ర్శియ‌ల్ పాయింట్ ను ప‌ట్టుకునే ఈ సినిమా కూడా తెర‌కెక్కించార‌పిస్తుంది. హార‌ర్ కామెడీ నేప‌థ్యంలో చిత్రాన్ని చ‌క్క‌గా తెరకెక్కించారు. విజువ‌ల్స్, పాట‌లు బాగున్నాయి. న‌టీన‌టులంతా బాగా న‌టించార‌ని పాట‌ల్లోనే తెలుస్తోంది. సినిమా కూడా మంచి విజ‌యం సాధించి నిర్మాత‌కు మంచి లాభాలు తీసుకురావాలి. అలాగే థియేట‌ర్ల విష‌య‌మై నా స‌హ‌కారం అందిస్తాను` అని అన్నారు.

  కథకు తగినట్టు హాస్యం..

  కథకు తగినట్టు హాస్యం..

  నిర్మాత డి.ఎస్ రావు మాట్లాడుతూ, ` ద‌ర్శ‌కుడు ఎంపిక చేసుకున్న క‌థ బాగుంది. ఇలాంటి క‌థ‌కు హాస్యం, హార‌ర్ ను జోడించి చ‌క్క‌గా తెర‌కెక్కించారు. పాట‌ల్లో కొత్త‌ద‌నం ఉంది. సినిమా విజ‌యం సాధించి అంద‌రికీ మంచి పేరు తీసుకురావాలి` అని అన్నారు.

  Ravi Teja's mother Rajyalaxmi Reacted on Her Son Drug Rumors
  రచ్చ రవి సీన్లు బాగుంటాయి..

  రచ్చ రవి సీన్లు బాగుంటాయి..

  హీరో మాగంటి శ్రీనాథ్ మాట్లాడుతూ, ` మా నాన్న గారు నాలో సినిమా ఫ్యాష‌న్ చూసి ప్రోత్సహించారు. అందువ‌ల్లే ఇక్క‌డి వ‌ర‌కూ రాగ‌లిగాను. ఆరంభంలో మంచి క‌థ‌లో న‌టించే అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ర‌చ్చ ర‌వి, ఆర్ పి తో నా కాంబినేష‌న్ సీన్స్ బాగుంటాయి. సినిమా బాగా వ‌చ్చింది. సినిమా చూస్తే క్లాస్ ఆడియ‌న్స్ కూడా మాస్ ఆడియ‌న్స్ లా ఫీల్ అవుతారు. తెలుగు ప్రేక్ష‌కులంతా మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం` అని అన్నారు.

  చక్కగా నటించారు..

  చక్కగా నటించారు..

  చిత్ర ద‌ర్శ‌కుడు ర‌వి వ‌ర్మ మాట్లాడుతూ, ` ర‌చ్చ‌ర‌వి, ఆర్.పి, శ్రీనాధ్ ను దృష్టిల్లో పెట్టుకుని క‌థ రాసుకున్నా. నేను అనుకున్న దానిక‌న్నా బాగా న‌టించారు. శ్రీనాధ్ కొత్త కుర్రాడైనా చ‌క్క‌గా న‌టించాడు. కామెడీ హైలైట్ గా ఉంటుంది. హార‌ర్ స‌న్నివేశాలు ప్రేక్షకుల‌ను థ్రిల్ కు గురిచేస్తాయి` అని అన్నారు.

  అందరికీ నచ్చుతుంది..

  అందరికీ నచ్చుతుంది..

  హీరోయిన్ సాక్షి క‌క్క‌ర్ మాట్లాడుతూ, ` ఈ సినిమా నాకు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. ఇప్ప‌టివ‌ర‌కూ నేను న‌టించిన సినిమాల‌న్నింకంటే భిన్న‌మైన పాత్ర పోషించాను. అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.

  ర‌చ‌నా స్మిత్, రిచా పాండేలు సినిమాలో అవ‌కాశం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం తెలిపారు.

  ర‌చ‌నా స్మిత్, రిచా పాండేలు సినిమాలో అవ‌కాశం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం తెలిపారు.

  ఈ వేడుక‌లో ద‌ర్శ‌కుడు సాగ‌ర్, తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్యానారాయ‌ణ‌, సాయి వెంక‌ట్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇత‌ర పాత్ర‌ల్లో జీవా, గౌతం రాజు, అప్పారావు, అర్షిత్ సాయి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కృష్ణ ప్ర‌సాద్, పాట‌లు: సాయి కుమార్, నేప‌థ్య సంగీతం: ఏలేంద‌ర్, స‌హ‌-నిర్మాత‌లు: ఎమ్. ర‌త్న శేఖ‌ర్ రావు, ఎమ్. మ‌ధుసూద‌న్ రెడ్డి, వి. రామ్ కిషోర్ రెడ్డి, ఎమ్. సౌజ‌న్య‌, నిర్మాత‌: స‌రిత‌, ద‌ర్శ‌క‌త్వం: వి. ర‌వివ‌ర్మ‌

  English summary
  Edem Dayyam movie is picturised as horror comedy. Director is Ravi Verma, Hero is Maganti Srinath. Comedians Rachcha Ravi, kirak RP are in key roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X