జాతీయ అవార్డు గ్రహీత, సినీ ప్రముఖుడు కన్నుమూత
జాతీయ అవార్డ్ గ్రహీత.. సిరిసిరిమువ్వ ఎడిటర్ కె బాబురావు కన్నుమూత..కళాతపస్వి కే విశ్వనాథ్ గారి దగ్గర కొన్ని సినిమాలకు ఎడిటర్ గా పని చేసిన కె బాబురావు గారు చెన్నైలో కన్నుమూసారు. కొన్ని రోజులుగా ఈయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఒకప్పుడు కళాతపస్వి సినిమాలకు తనదైన శైలిలో బాబురావు ఎడిటింగ్ చేశారు.
ఈయన ఎడిట్ చేసిన సిరిసిరిమువ్వ సినిమాకు గానూ ఉత్తమ ఎడిటర్ గా జాతీయ అవార్డ్ కూడా అందుకున్నారు బాబురావు. ఆ తర్వాత కూడా విశ్వనాథ్ గారితో ఆయన సాన్నిహిత్యం సాగింది. పలు హిందీ సినిమాలకు కూడా ఈయన ఎడిటర్ గా పని చేశారు.

ఎడిటర్ బాబురావు మృతిపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని, బాబూరావు ఆత్మకు శాంతి కలిగించాలని దక్షిణాది సీనీ ఇండస్ట్రీ సంతాపం తెలియచేసింది.


Click it and Unblock the Notifications











