twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రావణ్' తప్పు, ఒప్పులపై ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వివరణ

    By Srikanya
    |

    'రావణ్' సినిమా మొదటి సీన్ లోనే పాత్రలు సెటప్ చేయకుండా కథలోకి వెళ్ళిపోవటానికి కారణం ఉందన్నారు చిత్ర ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. ఆయన ఈ విషయం పై మాట్లాడుతూ...దానికో రీజన్ ఉంది. డైరక్టర్ మణిరత్నం ఆ రకంగా ఓ కొత్త విధానంలో వెరీ హై నోట్ తో స్టోరీ నేరేషన్ ప్రారంభిద్దామనుకున్నారు. కిడ్నాప్ తో ప్రారంభమైన కథ చివరి వరకూ అదే టెంపోలో జరగుతుంది. మేం వెనక్కి వచ్చి ఆ పాత్రలు ఎవరు, వారి గురించి వివరణలు ఇవ్వదలుచుకోలేదు. మేం ప్రేక్షకులుకు ప్రతీ విషయం విప్పి చెబుతూ...స్పూన్ ఫీడింగ్ ఇవ్వటానికి ఇష్టపడలేదు. అలాగే స్టోరీ టెల్లింగ్ లో ఇదో కొత్త ప్యాట్రన్ గా భావించాం. సెకెండాఫ్ లో కొద్దిగా అసలు ఈ కథకు కారణం ఏంటనేది ఓ పాటలో వివరించే ప్రయత్నం చేసాం అంతే. ఇక అమితాబ్ ఈ చిత్రంకోసం అభిషేక్ పాత్ర పది తలలను గ్రాఫిక్స్ లో చూపితే బావుంటుందని వ్యక్తం చేసారు. అయితే మణి,నేను అట్లాంటిది ఉండకూడదు, ప్రేక్షకులు పాత్రలో లీనమై ఆ ఫీలింగ్ తెచ్చుకోవాలి అని నిర్ణయించుకున్నాం. అయితే అది క్లిష్టమైనదని మాకూ తెలుసు.

    ఇక అమితాబ్ ఆయనపై చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా....ఆయనేది చెప్పదలుచుకున్నారో అదే చెప్పనివ్వండి...అలాగే మేము మిస్టర్ బచ్చన్ ని హర్ట్ చేసేలా ఏమీ మాట్లాడదలుచుకోలేదు..ఎందుకంటే ఆయన సీనియర్ ఆర్టిస్టు..అంటూ సమాధానమిచ్చారు శ్రీకర్ ప్రసాద్. రావణ్ చిత్రం ఎడిటింగ్ పూర్ ఉందంటూ అమితాబ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తొలిసారిగా నోర విప్పారు. నేషనల్ మీడియాతో ఏడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న ఈ ఎడిటర్ మాట్లాడుతూ..ఓ ప్రేక్షుకుడుగా ఆయనకు సినిమాను ఆయన ఇష్టం వచ్చినట్లు విమర్శించే హక్కు ఉంది. అయితే మా కష్టాన్ని కూడా గుర్తించాలి. దాదాపు ఏడాదిన్నర పాటు ఈ చిత్రం ఎడిటింగ్ చేసాము. ఎంతో ఫుటేజ్ ని ప్రక్కన పెట్టి బెస్ట్ అనుకున్న దానిని ఎడిట్ చేస్తూ, సినిమాకి ఏది అవసరమో జడ్జ్ చేసుకుంటూ మణి సార్, నేనూ ముందుకు సాగాం. ఆ ఫుటేజ్ ఏదీ అమితాబ్ చూడలేదు అన్నారు.

    ఇక శ్రీకర్ ప్రసాద్ గతంలో యువ, గురు చిత్రాలుకు పనిచేసారు. ఆ విషయం ప్రస్దావిస్తూ...నేను, మణి సార్ కలిసి గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మా వేవ్ లెంగ్త్ కలిసింది. మేం ఎప్పుడు క్టారక్టర్స్ మోటివేషన్స్ ను కథ నడిచేటప్పుడు సంఘటనలతో తెలిస్తే బావుంటుదనుకునే అదే చేస్తూంటాం. ఇక ఫైనల్ గా ఈ విషయంలో అమితాబ్ ద్వారా నేను కాంట్రావర్శీ అవటం దురదృష్టం అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X