ఏదో జరిగే.... ‘నీది నాదే ఒకటే కథ’ సాంగ్ సూపర్బ్
శ్రీ విష్ణు కథానాయకుడిగా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం 'నీది నాది ఒకే కథ'. ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన 'ఏదో జరిగే' వీడియో సాంగ్ విడుదల చేశారు.
ఏదో జరిగే..
హీరోయిన్ సత్నా టిటుస్ మీద చిత్రీకరించిన ఈ సాంగ్ చాలా బావుంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి కంపోజ్ చేసిన ట్యూన్ వినసొంపుగా ఉంది. ఈ చిత్రానికి రోహిత్ సమర్పకుడు కాగా ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మాతలుగా వ్యవహరించారు.

సామాన్యుడితో టీజర్ లాంచ్
ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ఒక బైక్ మెకానిక్ చేత ఈ టీజర్ విడుదల చేయించారు. దీనిపై దర్శకడు మాట్లాడుతూ ‘ఫిల్మ్ టీజర్ రిలీజ్ చెయ్యటానికి సెలబ్రిటీలను సంప్రదించకుండా నేరుగా ఒక సామాన్యుడితో చేయించామని, ఇది సమాన్యుడి కథ కాబట్టే ఇలా చేశామని తెలిపారు.

శ్రీవిష్ణు పాత్ర
చదువులో రాణించలేక ప్రతిసారి ఫెయిల్ అవుతూ తండ్రితో తిట్లుతినే పాత్రలో శ్రీవిష్ణు కనిపించారు. ఇటీవల విడుదలైన టీజర్లో శ్రీ విష్ణు పడే సంఘర్షణ సినిమాపై ఆసక్తి మరింత పెంచే విధంగా ఉంది.
టీజర్
నీది నాది ఒకే కథ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











