సురేంద్ర రెడ్డి, కృష్ణ వంశీలను ప్రక్కన నెట్టి కరుణాకరన్..
'తొలిప్రేమ' నుంచి 'డార్లింగ్' దాకా దాదాపు ప్రేమ కథలనే ఎంచుకుంటూ వస్తున్న దర్శకుడు కరుణాకరన్ తాజాగా హీరో రామ్ తో ఓ చిత్రం చేయటానికి కమిటయ్యారు. 'ఎదురే లేదు' అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రం త్వరలో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి సురేంద్రరెడ్డి డైరక్షన్ లో స్రవంతి రవి కిషోర్ నిర్మాతగా ఊసరవెల్లి చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎక్కువ బడ్జెట్ కావటం, కథ ఇంకా పూర్తి స్ధాయిలో రెడీ కాకపోవటంతో అది పెండింగ్ లో పెట్టారని తెలుస్తోంది. అలాగే కృష్ణ వంశీ తో రామ్ హీరోగా అనుకున్న కందిరీగ చిత్రం కూడా ఇంకా ప్లానింగ్ స్టేజీలోనే ఉంది. దాంతో ఆ గ్యాప్ లోకి కరుణా కరన్ వచ్చి కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. డార్లింగ్ డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకోవటం ప్లస్ అయిందంటున్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజీ ని అనుకరించే రామ్ ని పవన్ తో సినిమా చేసిన కరుణాకరన్ కి కరెక్టుగా సూట్ అవుతుందనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.


Click it and Unblock the Notifications











