‘ఎదురే లేని’ నిర్మాతకి రామ్-ఛరణ్ ...!?
సున్నితమైన ప్రేమ కథల స్పెషలిస్ట్ డైరెక్టర్ కరుణాకరన్ తాజాగా తన పంథా మార్చి యాక్షన్ కథాంశంతో యువ హీరోతో ఒక సినమా రూపొందించనున్నాడని సమాచారం. ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ చిత్రాల విజయాలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన దర్శకుడు కరుణాకరన్ తన తదుపరి చిత్రాన్ని యునైటెడ్ మూవీస్ బేనర్ లో చెయ్యబోతున్నారు. అయితే హీరో ఎవరనే అంశం పై మాత్రం నిర్మాత పరుచూరి కిరీటితో కరుణాకరన్ చర్చలు ఇంకా జరుగుతూనే వున్నాయట. 'ఎదురే లేదు" అనే టైటిల్ తో తను రెడీ చేసిన స్క్రిప్ట్ 'మగధీర" రామ్ చరణ్ కైతేనే బాగుంటుందని కరుణాకరన్..
చెర్రీ డేట్స్ దొరకడం లేట్ అవుతుందేమో, 'రామరామ కృష్ణకృష్ణ" రామ్ తో చేసేద్దామని నిర్మాత కిరీటి ఒకరినొకరు కన్విన్స్ చేసుకునే పనిలో వున్నారు. అయితే మరో పక్కన రామ్ హీరోగా పేపర్ వరకే ఆగిపోయిన రెండు సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మొదలు కావాల్సిన 'ఊసరవెల్లి" చిత్రానికి బడ్జెట్ దెబ్బ ఎదురైంది, ఇక రెండోది కృష్ణవంశీ సినిమా 'కందిరీగ"మరి చివరికి తనకు ఎప్పుడు కడుతుందో తెలియని పరిస్థితి. మరి అయితే 'ఎదురే లేదు" అని తెరపై రామ్ ఉంటాడో చరణ్ ఉంటాడో వేచి చూద్దాం.


Click it and Unblock the Notifications











