కష్టాలు కంటిన్యూ: తారకరత్న నిర్మాతపై చీటింగ్ కేసు

By Srikanya

హైదరాబాద్: కొన్ని సినిమాలకు ప్రారంభం నాటి నుంచీ ఏదో ఒక సమస్య ఎదురౌతూనే ఉంటుంది. అలాంటిదే తారకరత్న అలెగ్జాండర్ చిత్రం. గతంలోనూ చిత్ర,విచిత్రమైన సమస్యలు ఎదుర్కొన్న ఈ చిత్రం రిలీజైనా మళ్లీ ఇప్పుడు ఛీటింగ్ కేసులో ఇరుక్కుని వార్తల్లో నిలించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నందమూరి తారకరత్న హీరోగా నటించిన ఎదురులేని అలెగ్జాండర్ చిత్ర నిర్మాత పీఎల్‌కే రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయింది. మూడునెలల క్రితం విడుదలైన ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు రూ.20 లక్షలు పెట్టుబడిగా పెట్టిన తనను పీఎల్‌కే రెడ్డి మోసం చేశారని ఆరోపిస్తూ పొన్నుగంటి రాజారెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు.

ఈ సినిమాలో హీరోగా నటించేందుకు తారకరత్నకు తాను రూ.5 లక్షలను అడ్వాన్స్‌గా చెల్లించానని రాజారెడ్డి కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు. దాంతో నిర్మాతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని జూబ్లీహిల్స్ పోలీసులను కోర్టు ఆదేశించింది.

Eduruleni Alexander producer in cheating case

ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి మంగళవారం పీఎల్‌కేరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసులో వాస్తవాలను తెలుసు కునేందుకు హీరో తారకరత్నకు ఒకట్రెండు రోజుల్లో నోటీసులు జారీచేసి ఆయన వాంగ్మూలం తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

గతంలో...

హైదరాబాద్‌లోని నానక్‌రాంగుడాలోని లెదర్ ఫ్యాక్టరీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతూండగా... ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు అంటుకుని తారకరత్న గాయపడ్డారు. ఆయనను వెంటనే అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పుడు సేఫ్ గా బయిటపడ్డారు.

అలాగే ఈ చిత్రం షూటింగ్ జరుగుతూండగా ఓ సారి పోలీసులు బ్రేక్ వేసారు. తారక రత్న నటిస్తున్న 'ఎదురు లేని అలెగ్జాండర్' చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ ఏరియా శంకర్ పల్లిలో జరుగుతోంది. అయితే ముందస్తు అనుమతి లేకుండా షూటింగ్ జరుపుతుండటంతో పోలీసులు అడ్డుకున్నారు.

అనుమతి లేకుండా షూటింగులు నిర్వహిస్తుండటంతో ఇటీవల పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అనుమతి లేకుండా జరుగుతున్న షూటింగులపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నామని అన్నారు. షూటింగుల సమయంలో అనుమతి తప్పని సరని, తమ విధి నిర్వహణలో భాగంగానే సినిమాను అడ్డుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

చిత్రం కథేమిటంటే..

అలెగ్జాండర్ (తారకరత్న), విశాఖపట్నంలో ఓ పొలిసు ఇన్స్పెక్టర్. నగరంలో అన్యాయాన్ని అరికడుతు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకుంటాడు. ఒక రోజు
అలెగ్జాండర్ విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు బదిలి అవుతాడు.

జిన్నాబాయి (రవి బాబు) మరియు కొట్టప్ప(జయప్రకాశ్ రెడ్డి)లు హైదరబాద్ లో భూ కబ్జాలు, వ్యబిచారం లాంటి చట్టవ్యేతిరేఖ పనులు చేస్తుంటారు. కాలేజి అబ్బాయిల సహాయంతో జిన్నబాయి, యువతులను ట్రాప్ చేసి వ్యబిచారంలోకి దిమ్పుతాడు. మిగతా కథ అంతా, అలెగ్జాండర్ ఈ అక్రమాలను ఎలా అరికడుతాడు అనే దానిపైనే నడుస్తుంది.

పోచా సాహితి ధనుష్ రెడ్డి సమర్పణలో పి.ఎల్.కె.రెడ్డి నిర్మాణమైన ఈచిత్రంలో కుంకుమ్ అనే కొత్త హీరోయిన్ పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో తారకరత్న పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ చిత్రంలో తారకరత్న, కుంకుమ్ తో పాటు రవిబాబు, విజయ్, ఉదయ్ తేజ, ఎ.వి.ఎస్, కొండవలస, రామకృష్ణ, సురేష్ తదితరులు నటించారు. ఈచిత్రానికి మాటలు: చింతా శ్రీనివాస్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, చింతా శ్రీనివాస్, ఆర్ట్: భాస్కర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: తోట రమణ, సంగీతం: జోష్యభట్ల శర్మ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X