నా డబ్బుతో గోవాలో ఎంజాయ్ చేస్తారా? సురేష్ బాబు మాటతో షాకైన డైరెక్టర్

By Bojja Kumar

Recommended Video

Ee Nagaraniki Emaindi Trailer

'పెళ్లి చూపులు' సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్. తొలి సినిమా తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న ఈ యువ దర్శకుడు త్వరలో 'ఈ నగరానికి ఏమైంది?' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూన్ 29న ఈ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ ఈ మూవీ జర్నీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

షార్ట్ ఫిల్మ్ మేకర్స్ గురించే ఈ సినిమా

షార్ట్ ఫిల్మ్ మేకర్స్ గురించే ఈ సినిమా

నేను షార్ట్ ఫిల్మ్స్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన వాడిని, ఇపుడున్న చాలా మంది యంగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా అలాంటి బ్యాగ్రౌండ్ నుండి వచ్చినవారే. వారి జర్నీ ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. ఈ కథను తెరపైకి తీసుకొస్తే బావుంటుందనే ఉద్దేశ్యంతో ‘ఈ నగరానికి ఏమైంది?' కథ రాసుకున్నట్లు తరుణ్ భాస్కర్ తెలిపారు.

ముందు ఎవరూ నమ్మలేదు

ముందు ఎవరూ నమ్మలేదు

ఈ సినిమా గురించి రాసుకున్న మొదటి డ్రాఫ్ట్ నిర్మాత సురేష్ బాబుకు చెప్పడం జరిగింది. ఆయన క్యాజువల్‌గా విని ఓకే చేసుకో అన్నారు. ఆయనకు ఈ కథ నచ్చింది అంటే మొదట నేను నమ్మలేదు, మా టీం నమ్మలేదు... చేసుకో అనడంతో ఏదో జోక్ చేస్తున్నారేమో అనుకున్నాం. షూటింగ్ మొదలు పెట్టండి అని ఆయన చెప్పిన తరువాతే అందరిలో నమ్మకం ఏర్పడింది అని తరుణ్ భాస్కర్ తెలిపారు.

నా డబ్బుతో గోవాలో ఎంజాయ్ చేస్తారా అన్నారు

నా డబ్బుతో గోవాలో ఎంజాయ్ చేస్తారా అన్నారు

ఆల్రెడీ సురేష్ సర్‌కు ఈ మూవీ సగం షూటింగ్ గోవాలో ఉంటుంది అని ముందే చెప్పాను. ఆ విషయం చెప్పగానే ఆయన ఒకసారి నావైపు చూసి.... మీ అందరూ నా డబ్బులతో గోవాకు వెకేషన్ వెళతారా? అన్నారు, అలాంటిదేమీ లేదుసార్ అని నేను అనడంతో.... లేదు లేదు అలానే ఉండాలి హ్యావ్ ఫన్ అన్నారు. మొదట ఆయన అలా అనడంతో షాకయ్యాను... కానీ ఆయన ఈ సినిమాకు చాలా సపోర్ట్ చేశారు. మేము ఏది కావాలన్నా ఇచ్చారు అని తరుణ్ భాస్కర్ తెలిపారు.

సినిమా గురించి..

సినిమా గురించి..

నలుగురు ఫ్రెండ్స్, మందు, సినిమా చుట్టూ తిరిగే ఈ చిత్రానికి "నగరానికి ఏమైంది" అనే టైటిల్ యాప్ట్ అని ఫిక్స్ అయ్యామ్. ఆ టైటిల్ సజెస్ట్ చేసింది నా బెస్ట్ ఫ్రెండ్ & కో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కౌశిక్ నండూరి. ఇక మమ్మల్ని గైడ్ చేసే బాధ్యతను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సిద్ధారెడ్డిగారు తీసుకొన్నాను. మా ప్రొడక్షన్ డిజైనర్ (ఆర్ట్ & కాస్ట్యూమ్స్) శ్రీమతి లత తరుణ్ ఈ సినిమా కోసం ఫెంటాస్టిక్ వర్క్ చేసిందని చెప్పాలి ఎందుకంటే ఆమె నా భార్య కాబట్టి. ఈ సినిమాతో నాకు నికేట్ బొమ్మిరెడ్డి అనే ఎక్స్ లెంట్ & టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ స్నేహితుడిగా దొరికాడు. భవిష్యత్ లో అతను ఇండస్ట్రీకి పెద్ద ఎస్సెట్ అవుతాడు. ఇక మా స్వర స్వేగర్ (అలా పిలవడం అతనికి ఇష్టం ఉండదు కానీ..) మిస్టర్.వివేక్ సాగర్ ఈ చిత్రానికి డిఫరెంట్ మ్యూజిక్ అందించాడు. మా ఎడిటర్ రవితేజ గిరిజాల అయితే నేను గనుక ఇంకోక్క ఎడిట్ ఛేంజ్ అడిగానంటే ఉద్యోగం మానేసి వెళ్లిపోతాడేమో. మా కూలెస్ట్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు గారు..... అంటూ తన చిత్ర బృందం గురించి తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

 కీలక పాత్రలు వీరే

కీలక పాత్రలు వీరే

కార్తీక్ (సుశాంత్ రెడ్డి), ఎలైట్ పబ్ లో వర్క్ చేసే ఓ మ్యానేజర్. వైన్ టెస్ట్ చేయడంలో సిద్ధహస్తుడు కానీ.. ఫ్రెండ్స్ ను సెలక్ట్ చేసుకోవడంలో మాత్రం పూర్. వివేక్ (విశ్వక్సేన్ నాయుడు) మన కార్తీక్ బెస్ట్ ఫ్రెండ్, మంచి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కానీ మందుకు బానిస, కానీ ఆ విషయాన్ని ఒప్పుకోడు. ఉప్పు (వెంకటేష్ కాకమాను) ఓ వెడ్డింగ్ ఫిలిమ్ ఎడిటర్, బార్ కి వచ్చి మిల్క్ షేక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేసే టైపు. ఇక మిగిలింది కౌషిక్ వెర్షన్ 2.0 (అభినవ్ గోమటం). వీళ్ళతోపాటు అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

తన జీవిత అనుభవం నుండే...

నేను నా జీవితంలో అమితంగా వేల్యూ ఇచ్చేది, నమ్మేది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే. నా స్నేహితులతో నేను చేసిన పాయింట్ లెస్ కన్వర్జేషన్స్, క్రేజీ ట్రిప్స్, సిల్లీ షార్ట్ ఫిలిమ్స్ నన్ను ఒక బెటర్ పర్సన్ గా తీర్చిదిద్దడంతోపాటు నా జీవితాన్ని మరింత ఆనందంతో నింపాయి. ఆ మెమరబుల్ మూమెంట్స్ అన్నిట్నీ క్యాప్చ్యూర్ చేసి వీలైనంత హ్యూమర్ తో ఈ సినిమాను తెరకెక్కించాను... అని తరుణ్ భాస్కర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X