twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లి చూపులు డైరెక్టర్ నెక్ట్స్ మూవీ ‘ఈ నగరానికి ఏమైంది’ (ట్రైలర్)

    By Bojja Kumar
    |

    'పెళ్లి చూపులు' సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హైలెట్ అయ్యాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుండి వస్తున్న రెండో మూవీ 'ఈ నగరానికి ఏమైంది'. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. రోటీన్ సినిమాలకు భిన్నంగా...రియాల్టీకి దగ్గరగా, ఈ జనరేషన్ టేస్టుకు తగిన విధంగా మరోసారి తరుణ్ భాస్కర్ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించబోతున్నాడని స్పష్టమవుతోంది.

    నలుగురు ఫ్రెండ్స్... మందు, సినిమా చుట్టూ తిరిగే కత

    నలుగురు ఫ్రెండ్స్... మందు, సినిమా చుట్టూ తిరిగే కత

    నలుగురు ఫ్రెండ్స్, మందు, సినిమా చుట్టూ తిరిగే కథ ఇది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంతో పాటు.... ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    సినిమా గురించి తరుణ్ భాస్కర్

    సినిమా గురించి తరుణ్ భాస్కర్

    నలుగురు ఫ్రెండ్స్, మందు, సినిమా చుట్టూ తిరిగే ఈ చిత్రానికి "నగరానికి ఏమైంది" అనే టైటిల్ యాప్ట్ అని ఫిక్స్ అయ్యామ్. ఆ టైటిల్ సజెస్ట్ చేసింది నా బెస్ట్ ఫ్రెండ్ & కో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కౌశిక్ నండూరి. ఇక మమ్మల్ని గైడ్ చేసే బాధ్యతను మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట సిద్ధారెడ్డిగారు తీసుకొన్నాను. మా ప్రొడక్షన్ డిజైనర్ (ఆర్ట్ & కాస్ట్యూమ్స్) శ్రీమతి లత తరుణ్ ఈ సినిమా కోసం ఫెంటాస్టిక్ వర్క్ చేసిందని చెప్పాలి ఎందుకంటే ఆమె నా భార్య కాబట్టి. ఈ సినిమాతో నాకు నికేట్ బొమ్మిరెడ్డి అనే ఎక్స్ లెంట్ & టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ స్నేహితుడిగా దొరికాడు. భవిష్యత్ లో అతను ఇండస్ట్రీకి పెద్ద ఎస్సెట్ అవుతాడు. ఇక మా స్వర స్వేగర్ (అలా పిలవడం అతనికి ఇష్టం ఉండదు కానీ..) మిస్టర్.వివేక్ సాగర్ ఈ చిత్రానికి డిఫరెంట్ మ్యూజిక్ అందించాడు. మా ఎడిటర్ రవితేజ గిరిజాల అయితే నేను గనుక ఇంకోక్క ఎడిట్ ఛేంజ్ అడిగానంటే ఉద్యోగం మానేసి వెళ్లిపోతాడేమో. మా కూలెస్ట్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు గారు..... అంటూ తన చిత్ర బృందం గురించి తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.

    కీలక పాత్రలు వీరే

    కీలక పాత్రలు వీరే

    కార్తీక్ (సుశాంత్ రెడ్డి), ఎలైట్ పబ్ లో వర్క్ చేసే ఓ మ్యానేజర్. వైన్ టెస్ట్ చేయడంలో సిద్ధహస్తుడు కానీ.. ఫ్రెండ్స్ ను సెలక్ట్ చేసుకోవడంలో మాత్రం పూర్. వివేక్ (విశ్వక్సేన్ నాయుడు) మన కార్తీక్ బెస్ట్ ఫ్రెండ్, మంచి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కానీ మందుకు బానిస, కానీ ఆ విషయాన్ని ఒప్పుకోడు. ఉప్పు (వెంకటేష్ కాకమాను) ఓ వెడ్డింగ్ ఫిలిమ్ ఎడిటర్, బార్ కి వచ్చి మిల్క్ షేక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేసే టైపు. ఇక మిగిలింది కౌషిక్ వెర్షన్ 2.0 (అభినవ్ గోమటం). వీళ్ళతోపాటు అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

    తన జీవిత అనుభవం నుండే...

    నేను నా జీవితంలో అమితంగా వేల్యూ ఇచ్చేది, నమ్మేది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే. నా స్నేహితులతో నేను చేసిన పాయింట్ లెస్ కన్వర్జేషన్స్, క్రేజీ ట్రిప్స్, సిల్లీ షార్ట్ ఫిలిమ్స్ నన్ను ఒక బెటర్ పర్సన్ గా తీర్చిదిద్దడంతోపాటు నా జీవితాన్ని మరింత ఆనందంతో నింపాయి. ఆ మెమరబుల్ మూమెంట్స్ అన్నిట్నీ క్యాప్చ్యూర్ చేసి వీలైనంత హ్యూమర్ తో ఈ సినిమాను తెరకెక్కించాను... అని తరుణ్ భాస్కర్ తెలిపారు.

    English summary
    #EeNagaranikiEmaindi is the second feature film of Tharun Bhascker who earlier directed the super hit film #Pellichoopulu. This film features new faces Vishwak Sen, Sai Sushanth, Abhinav Gomatam, Venkatesh Kakumanu, Anisha Ambrose and Simran Chowdary. The music for the film is by Vivek Sagar (Tapeloop), Production Design is by Latha Tharun, Cinematography by Niketh Bommireddy, Editing by Raviteja Girijala and Venkat Siddareddy is the Executive Producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X