ఆంబోతులా ప్రవర్తిస్తూ తిరిగే హీరో...
హీరో శ్రీ మాట్లాడుతూ "టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ సినిమా ఫాస్ట్‌గా నడుస్తుంది. డైలాగ్స్ బాగుంటాయి. గ్రామీణ నేపథ్యంలో కథ నడుస్తుంది. నిర్లక్ష్యంగా ఉంటూ అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉండే పాత్ర'' అని చెప్పారు. ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మురళి, వెన్నెల కిశోర్, చంటి, ధనరాజ్, ప్రవీణ్, వైభవ్, భవాని, భువనేశ్వరి, జాహ్నవి, బేబి తన్మయి తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: తిరుమలశెట్టి గిరీశ్‌కిరణ్, సంగీతం: శ్రీవసంత్, ఛాయాగ్రహణం: వెంకటప్రసాద్, కళ: వి.ఎన్. సాయిమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ ఉప్పుటూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సిహెచ్. సుధీర్‌రాజు.
అలాగే ఇదే హీరో మరో చిత్రం కమిటయ్యారు. ఆ చిత్రం టైటిల్ 'దూల శీను'. థర్మపథ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి 'దూల శీను' పేరు పెట్టారు. 'ఈరోజుల్లో' ఫేమ్ శ్రీ, తషుకౌశిక్ జంటగా నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా 28 రోజులు జరిగింది. ఇప్పటికి డెబ్పైశాతం టాకీ, రెండు పాటలు చిత్రీకరణ పూర్తయింది. రాజ్ కందుకూరి స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఆయన చిత్రం గురించి చెబుతూ ''ఇటీవల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టుడియోలో 'సింహాలై గర్జిద్దాం, సంహారం సాగిద్దాం.. అనే పాటను చిత్రీకరించాం. ప్రేమ నృత్యరీతుల్ని సమకూర్చారు. వినోదాత్మకంగా సాగే చిత్రమిది. సినిమా దాదాపుగా పూర్తయింది. మిగతా భాగాన్ని ఇదే నెలలో చిత్రీకరించి నవంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాము''అన్నారు.
రొమాన్స్, కామెడీ ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ నుండి చివరి వరకూ పూర్తి వినోదభరితంగా ఉంటుందని అంటున్నారు. చిత్రం గురించి చెబుతూ...'సింపుల్‌లైన్ ఇది. నోటిదూలతో ఏదిబడిదే అది మాట్లాడేస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తి కథే ఈ చిత్రం. హీరో పాత్రను బట్టే చిత్రానికి టైటిల్ పెట్టాం. నోటిదూల వుండే హీరో నవ్వులు పండిస్తాడు. నవంబర్‌లో ఆడియోను చివర్లో చిత్రాన్ని విడుదల చేయనున్నా'మని చెప్పారు.


Click it and Unblock the Notifications












