'ఈ రోజుల్లో' హీరో కొత్త చిత్రం 'దూల శీను'
హైదరాబాద్ :'ఈ రోజుల్లో'చిత్రంతో పాపులరైన హీరో శ్రీ. అతను మరో చిత్రం కమిటయ్యారు. ఆ చిత్రం టైటిల్ 'దూల శీను'. థర్మపథ క్రియేషన్స్ పతాకంపై రాజ్ కందుకూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి 'దూల శీను' పేరు పెట్టారు. 'ఈరోజుల్లో' ఫేమ్ శ్రీ, తషుకౌశిక్ జంటగా నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ నాన్‌స్టాప్‌గా 28 రోజులు జరిగింది. ఇప్పటికి డెబ్పైశాతం టాకీ, రెండు పాటలు చిత్రీకరణ పూర్తయింది.
రాజ్ కందుకూరి స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఆయన చిత్రం గురించి చెబుతూ ''ఇటీవల హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టుడియోలో 'సింహాలై గర్జిద్దాం, సంహారం సాగిద్దాం.. అనే పాటను చిత్రీకరించాం. ప్రేమ నృత్యరీతుల్ని సమకూర్చారు. వినోదాత్మకంగా సాగే చిత్రమిది. సినిమా దాదాపుగా పూర్తయింది. మిగతా భాగాన్ని ఇదే నెలలో చిత్రీకరించి నవంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాము''అన్నారు.
రొమాన్స్, కామెడీ ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ నుండి చివరి వరకూ పూర్తి వినోదభరితంగా ఉంటుందని అంటున్నారు. చిత్రం గురించి చెబుతూ...'సింపుల్‌లైన్ ఇది. నోటిదూలతో ఏదిబడిదే అది మాట్లాడేస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తి కథే ఈ చిత్రం. హీరో పాత్రను బట్టే చిత్రానికి టైటిల్ పెట్టాం. నోటిదూల వుండే హీరో నవ్వులు పండిస్తాడు. నవంబర్‌లో ఆడియోను చివర్లో చిత్రాన్ని విడుదల చేయనున్నా'మని చెప్పారు.
ఈ నెలలో జరిగే 12రోజుల షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. 'దూలశీను'లో కోట శ్రీనివాసరావు, జీవా, గిరిబాబు, శ్రీలక్ష్మి, రజిత, సుమన్‌శెట్టి, అదుర్స్ రఘు, పృథ్వీ, గుండు సుదర్శన్, తడివేలు, రాజశేఖర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మురళీ వై.కృష్ణ, మాటలు: రామకృష్ణ, సంగీతం: జ్యోశ్యభట్ల.


Click it and Unblock the Notifications











