లాభాలొస్తే దిల్ రాజు వాలిపోతాడలా...!
లాభాలు వచ్చే సినిమాలను దక్కించుకోవడంలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఎప్పుడూ ముందుంటారు. అందులో భాగంగా 'ఈ రోజుల్లో..' చిత్రాన్ని కూడా దక్కించుకున్నాడు ఈ నిర్మాత. అనామక సినిమాగా కేవలం 100 థియేటర్లతో మొదలైన 'ఈ రోజుల్లో' సినిమా తొలి రోజు నుంచే మంచి స్పందన సొంతం చేసుకుంది. డబ్బులుంటేనే అమ్మాయిలు ప్రేమిస్తారని, అమ్మాయిలంతా కమర్షియల్ అయిపోయారని బలంగా విశ్వసించే మనస్తత్వంతో ఈ సినిమా హీరో పాత్ర వుంటుంది. అదే సమయంలో అబ్బాయిల స్నేహంలో నిజాయితీ వుండదని, వారు అమ్మాయిల పట్ల ఎక్కువగా శారీరక ఆకర్షణనే పెంచుకుంటారని భావించే మనస్తత్వాన్ని కలిగిన పాత్ర కథానాయికది. ఇలా భిన్న ధృవాలుగా వున్న వీరిద్దరి జీవిత ప్రయాణమే 'ఈ రోజుల్లో' చిత్ర కథ. ఈ అంశం యువతకు బాగా నచ్చడంతో భారీగా ఓపెనింగ్స్ వస్తున్నాయి. దీంతో దిల్ రాజు ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ ఫ్రైజ్‌కు దక్కించుకుని ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గుడ్ సినిమా గ్రూప్, మారుతి మీడియా హౌస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శ్రీ, రేష్మా నాయకానాయికలుగా నటించారు.


Click it and Unblock the Notifications











