'ఈ రోజుల్లో' హీరో నెక్స్ట్ ఆ దర్శకుడుతో
రీసెంట్ గా విడుదలైన ఈ రోజుల్లో చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అందులో నటించిన శ్రీకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు శేఖర్ సూరి తన చిత్రంలో హీరోగా బుక్ చేసుకున్నారు. ఏ ఫిల్మ్ బై అరవింద్' సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఆమధ్యకాలంలో వచ్చిన 'ఏ ఫిల్మ్ బై అరవింద్'హారర్ చిత్రాలకు ఈ సినిమా విజయమే స్ఫూర్తినిచ్చింది. శేఖర్‌సూరిని దర్శకుడిగా పరిచయం చేసింది. ఈ చిత్రానికి కొనసాగింపు రాబోతోంది. అదే... 'అరవింద్ 2'. ఈ కొత్త చిత్రానికి సైతం శేఖర్‌సూరి దర్శకత్వం వహిస్తారు. 'ఈ రోజుల్లో' చిత్రంతో ఆకట్టుకొన్న శ్రీ కథానాయకుడు.
అడోనికా కథానాయిక. రిషి ఓ కీలకపాత్రలో కనిపిస్తారు. జి.ఫణీంద్ర నిర్మాత. ''కథ, కథనాలే ఈ సినిమాకి ప్రాణం. మొదటి భాగం ఎక్కడ ఆగిందో ఈ కథ అక్కడి నుంచే మొదలవుతుంది. 'ఏ ఫిల్మ్ బై అరవింద్' కంటే మంచి చిత్రం అవుతుందనే నమ్మకం ఉందని'' నిర్మాత మీడియాకు చెప్పారు. ఈనెల 10 నుంచి షూటింగ్ ప్రారంభిస్తారు.


Click it and Unblock the Notifications












