ఈరోజుల్లో మారుతి నెస్ట్ సినిమా ‘బస్ స్టాప్’

'బస్ స్టాప్' చిత్రం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయి కెమెరా స్విచాన్ చేశారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్... సాయి గణేష్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ...నేను రాసిన స్ర్కిప్టును నమ్మి ఈ రోజుల్లో సినిమా తీశాను. పెద్ద హిట్ అయి మా టీమ్ అందరికీ మంచి పేరు వచ్చింది. బస్ స్టాప్ కథను సంవత్సరం నుంచి తయారు చేస్తున్నాను. ఈ సబ్జెక్టు తెరమీదకు తేవడానికి ఈ రోజుల్లో ఓ డెమో మాత్రమే. నా మొదటి సినిమా కన్నా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఈ సినిమా అందించనుంది. 'నీకు నాకు' టీం సినిమా హీరో హీరోయిన్ల నందిత, ప్రిన్స్ నా కథకు ఏప్ట్ అవుతారు అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా : ప్రభాకర్ రెడ్డి, మ్యూజిక్ : జెవి, అనీల్, ఎడిటర్ : ఉదయ్, దర్శకుడు : దాసరి మారుతి
మారుతి ఇది వరకు దర్శకత్వం వహించిన 'ఈ రోజుల్లో' చిత్రం విజయవంతంగా ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ రోజుల్లో చిత్రం ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించి తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.


Click it and Unblock the Notifications











