దూసుకెళ్తున్న ‘ఈ రోజుల్లో...’
ఎటువంటి అంచనాలు లేకుండా... పూర్తిగా కొత్త దర్శకుడు, కొత్త నిర్మాత, కొత్త నటులతో వచ్చిన స్మాల్ బడ్జెట్ సినిమా 'ఈరోజుల్లో..' ఎవరూ ఊహించని విధంగా సక్సెస్ అయి దూసుకెలుతోంది. దీంతో ఈచిత్ర నిర్మాతలైన గుడ్ ఫ్రెండ్స్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 100 థియేటర్లలో మొదలైన ఈ రోజుల్లో సినిమా కేవలం మూడు రోజుల్లో 155 థియేటర్లు చేరుకుంది. రెండో వారంలో ఈ సంఖ్య 280కి చేరనుందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు మారుతి మాట్లాడుతూ...సినిమా స్క్రప్టు చెప్పగానే ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్మిన మొట్ట మొదటి వ్యక్తులు గుడ్ ఫ్రెండ్స్. వారి నమ్మకం నిజమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రం విజయం సాధించడానికి సహకరించిన మీడియాకు కూడా ధన్యవాదాలు. మంచి కథతో సినిమా తీస్తే బ్రహ్మరథం పడతారని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు అని చెప్పుకొచ్చారు.
ఈ రోజుల్లో సినిమా చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ....5డి కెమెరాతో 'దొంగల ముఠా' చిత్రం తీసి నేను సాధించలేని విజయాన్ని మారుతి ఈ రోజుల్లో.. చిత్రంతో సాధించాడు అంటూ తన ట్విట్టర్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











