»   »  వర్షంలో సాగే రోమాంటిక్ లవ్ స్టోరీ

వర్షంలో సాగే రోమాంటిక్ లవ్ స్టోరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: ఓ అబ్బాయి తన ప్రేయసి వద్ద తన ప్రేమను ఎంత గొప్పగా వ్యక్తం చేశాడనే ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం 'ఈ వర్షం సాక్షిగా'. వరుణ్ సందేశ్, హరిప్రియ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్నారు. బి. ఓబుల్‌రెడ్డి, శ్రీనివాస్ చవాకులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

"ప్రేమికులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలియజేసే సినిమా ఇది. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ తమ ప్రేమను ఇలా వ్యక్తం చేసుంటే బాగుండేదని అనుకుంటారు'' అని ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శకుడు రమణ అన్నారు.

భోజ్‌పురిలో అనేక సినిమాలు నిర్మించిన తమకు ఇదే మొదటి తెలుగు సినిమా అనీ, నవంబర్ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనేది తమ సంకల్పమనీ నిర్మాత ఓబుల్‌రెడ్డి చెప్పారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ "ఇది వర్షంలో సాగే మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. మాటలు, పాటలు బాగున్నాయి'' అన్నారు.

చలపతిరావు, జీవా, శివారెడ్డి, కాశీ విశ్వనాథ్, హేమ, ఢిల్లీ రాజేశ్వరి, ధనరాజ్ తారాగణమైన ఈ చిత్రానికి కథ: ముకుంద్ పాండే, మాటలు: రామస్వామి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, శ్రీమణి, సంగీతం: అనిల్ గోపిరెడ్డి, ఛాయాగ్రహణం: మోహన్‌చంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం. కిశోర్‌కుమార్.

English summary
Vadun Sandesh and Haripriya paired Ee Varsham Saakshigaa film shooting has been completed recently. It is a romantic love story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu