రాజమౌళి ‘ఈగ’ ఆడియో రిలీజ్ విశేషాలు
వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మాతగా, డి. సురేష్ బాబు సమర్పణలో రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు రూపొందిన 'ఈగ' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. దర్శకరత్న దాసరి ఆడియో తొలి సీడీని ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు వారాహి చలన చిత్రం బ్యానర్‌ను ప్రారంభించారు. ఈ సంద్భంగా దాసరి మాట్లాడుతూ ఒక ఈటీ, ఒక రోబో సినిమాలా...'ఈగ' చిత్రం కూడా సెన్షేషన్ సృష్టించి, కమర్షియల్‌గా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. రాజమౌళి కుటుంబానికి సినిమానే జీవితం, ఎవరి అండదండలు లేకుండా స్వశక్తితో అగ్రస్థానికి ఎదిగారని ప్రశంసించారు. అగ్రహీరోలంతా రాజమౌళి దర్శకత్వంలో చేయాలని కోరుకుంటున్నారంటే అతను ఏ స్థాయికి ఎదిగాడో అర్థం చేసుకోవచ్చున్నారు. దర్శకుడిగా తనకంటూ ఓ ముద్రవేసుకుని, హీరోలకు ధీటుగా నిలబడ్డాడన్నారు. నాగార్జున మాట్లాడుతూ కీరవాణి సంగీతం అంటే నాకు ఎంతో ఇష్టం, రాజమౌళితో ఓ సినిమా చేయాలని ఉందని తన మసులోని మాట బయటపెట్టారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, ప్రభాస్, రవితేజ, రానా, సునీల్, చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











