'ఈగ' విడుదల వాయిదాపై రాజమౌళి ట్వీట్
రాజమౌళి తాజా తన తాజా చిత్రం ఈగ ఆడియో,సినిమా రిలీజ్ లు వాయిదా వేసారు. ఈ విషయాన్ని ట్విట్ చేస్తూ...ఈగ ఆడియో విడుదలని మార్చి 30కి పోస్ట్ ఫోన్ చేసారు. రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తాను. అలాగే గ్రాఫిక్స్ షాట్స్ లేవటంతో ట్రైలర్ విడుదల కొద్దిగా లేటయ్యేటట్లు ఉంది అన్నారు.
ఇక ఈగ చిత్రాన్ని చిత్రం కథ గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ... చీమ - ఏనుగూ మధ్య గొడవ జరిగితే ఎవరు గెలుస్తారు? దోమతో సింహం ఫైటింగుకి దిగితే ఏం జరుగుతుంది? రెండు ప్రశ్నలకూ ఒకటే సమాధానం. అల్పప్రాణులపై బలవంతులదే రాజ్యం. అయితే ఈ అహంకారం, అతి విశ్వాసం అప్పుడప్పుడూ చేటు తీసుకొస్తుంది. ఆ కథ తాబేలు, కుందేలూ పరుగుపందెంలా ఉంటుంది. ఇక్కడ కూడా ఓ 'ఈగ' మనిషిపై పోటీకి దిగింది. మరి గెలిచిందా? లేదా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'ఈగ' సినిమా చూడాల్సిందే.'ఓ దుర్మార్గుడితో 'ఈగ' చేసిన పోరాటం ఈ కథ. అలాగని ఈగని ఆకాశమంత పెద్దదిగా చూపించడం లేదు. దానికేం అద్భుత శక్తుల్ని ఆపాదించడం లేదు. సాధారణ పరిమాణంలోనే ఉంటుంది. అయినా పోరాడుతుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేశాం. తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేస్తామని అన్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులు. సాయి కొర్రపాటి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చెబుతూ సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్, సమర్పణ: డి.సురేష్ బాబు.


Click it and Unblock the Notifications











