రాజమౌళి ‘ఈగ’ ఆడియో స్పాట్ ఫిక్స్
మార్చి 30వ తేదీన 'ఈగ' చిత్రం ఆడియో విడుదల చేస్తున్నట్లు గతంలో దర్శకుడు రాజమౌళి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆడియో వేడుక ఎక్కడ నిర్వహిస్తున్నారనే విషయాలను రాజమౌళి తన మైక్రో బ్లాగింగ్ ద్వారా వెల్లడించారు. గచ్చిబౌలి లోని బ్రహ్మకుమారి అకాడమిలో ఆడియో విడుదల కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఆడిటోరియంలో 2వేల మంది వరకు కూర్చోవచ్చు.
నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులుగా ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈగ చిత్రం ప్రేక్షకుల ఊహకందని మాయాజాలంతో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్ తో రూపొందుతోంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. బలవంతుడైన విలన్ బలహీనమైన ఈగ చేతిలో ఎలా ఓడిపోయాడనేదే చిత్ర కథాంశమని, వినోదం, ఆశ్చర్యం, ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం రూపొందుతోంది.
మార్చి 30న పాటలను, ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజమౌళి సినీ కెరీర్లోనే ఓ అద్భుతమైన చిత్రంగా ఉండబోతోందని, రాజమౌళి కాన్ఫిడెన్సే ఇందుకు నిదర్శమని అంటున్నారు. ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాలన్నీ విజయవంతమైనవే కావడంతో 'ఈగ' చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











