100 దిశగా‘ఈగ’... ఇదేం ఖర్మరా బాబూ!
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' 100 రోజుల దిశగా దూసుకెలుతోంది. ఏంటి? సినిమా విడుదలే కాలేదు వందరోజుల దిశగా ఏమిటి? అని సందేహ పడుతున్నారు. మీరు విన్నది నిమజే. ఈగ చిత్రం ఆడియో విడుదలై 100 రోజుల దిశగా వెలుతోంది. ఆడియో వేడుక జరిగిన 100 రోజులు పూర్తి కావస్తున్నా...సినిమా విడుదలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.
మార్చి 30న ఈగ ఆడియో విడుదలైంది. నేటితో దాదాపుగా 70 రోజులు పూర్తయింది. మరో నెల గడిస్తే సెంచరీ ఖాయం. ఇటీవల రాజమౌళి తన ఫేస్ బుక్ పేజ్‌లో 'ఈగ' తమిళ వెర్షన్ చిత్రాన్ని ఎర్లీ జూన్‌లో విడుదల చేస్తున్నట్లు కొన్ని పిక్చర్స్ పోస్టు చేశాడు. తెలుగు వెర్షన్ మాత్రం ఎప్పుడనేది ఇంకా ఖరారు చేయలేదు. ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం జులైలో ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు.
ఆడియో విడుదలై వంద రోజులు పూర్తి చేసుకున్న తర్వాత విడుదలయ్యే చిత్రం బహుషా..'ఈగ' ఒక్కటే కాబోలు. అయితే సినీ ప్రేమికులు మాత్రం రాజమౌళి ఈ చిత్రాన్ని డిలే చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి చర్యల కారణంగా విసుగుపుట్టి సినిమాపై ఆసక్తి తగ్గుతుందని...ఇదేం ఖర్మరా బాబూ అంటూ పెదవి విరిస్తున్నారు.
గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదని పైకి రాజమౌళి చెబుతున్నప్పటికీ....పెద్ద హీరోల సినిమాలతో పోటీ పడటం ఇష్టం లేకనే ఇలా వాయిదా మీద వాయిదా వేస్తున్నాడనే వార్తలు కూడా లేక పోలేదు. ఏది ఏమైనా రాజమౌళి సినిమాల అభిమానులకు మాత్రం ఎదురు చూపులు మాత్రం అస్సలు రుచించడం లేదు.
'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ' రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ'గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ'ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ' అన్నదే క్లుప్తంగా 'ఈగ' కథాంశం.
ఈ చిత్రానికి సాయి కొర్రపాటి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 'సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్, సమర్పణ: డి.సురేష్ బాబు.


Click it and Unblock the Notifications











